మహేష్ బాబు లేటెస్ట్ ప్రెస్ మీట్ విశేషాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో చిత్రబృందం విరివిగా ప్రమోషన్స్ కార్యక్రమాలను జరుపుతోంది.

ఇక రీసెంట్ గానే హాలిడే ట్రిప్ ను ముగించుకుని హైదరాబాద్ వచ్చిన మహేష్..ఇవాళే మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందామా.

మహేష్ బాబు మాట్లాడుతూ ఇక ప్రస్తుతానికి ప్రయోగాత్మక చిత్రాలను చేసే ఓపిక లేదు. ఒకవేళ చేస్తే నాన్న గారి అభిమానులు ఇంటికొచ్చి కొట్టేసేలా ఉన్నారు. సో ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్ళాను అను ఖరాకండిగా చెప్పేశాడు.

మన తెలుగు స్టార్ హీరోల్లో వైవిధ్యమైన సినిమాలను ఎంకరేజ్ చేసే ఏకైక హీరో మహేష్ బాబు మాత్రమేనని జగమెరిగిన సత్యం. ఇలా తన సినిమాలపై బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

నా కెరీర్ లోనే బెస్ట్ ప్రి- రిలీజ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు ఇది. సినిమా రిలీజ్ కి ముందే ఒక బ్లాక్ బస్టర్ వైబ్ లో ఉన్నాం అందరం. ఈ సినిమాలో రెండు పార్ట్స్ రూపొందించగల కంటెంట్ ఉందని, చాలా సన్నివేశాలను ఎడిటింగ్లో తొలగించామని ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

నాన్న గారి ప్రభావం నా మీద తప్పకుండా ఉంటుంది. నేను రాంచరణ్ ఎన్టీఆర్ కలిస్తే సినిమాలు తప్ప అన్నీ మాట్లాడుకుంటాం. రీమేక్ సినిమాలు చేయను అని మరో సారి వెల్లడించారు.

వంశీ పైడిపల్లి గారితో కలిసి తన 25వ సినిమా చెస్తున్నను అని ఆ తర్వాత సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రం గార్ల స్క్రిప్ట్ వర్క్ స్టేజి లో ఉన్నయని వాటికి ఇంకా సమయం ఉందని చెప్పారు.

ఇప్పుడు రూపొందిన భరత్ అనే నేను చిత్రం పక్కా కమర్షియల్ ఎలెమెంట్స్ తో సీఎం పాత్రలో నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

టికెట్స్ పెట్టడమే ఆలస్యం వాటిని హాం ఫట్ అనిపించేశారు అభిమానులు. ఈ సినిమా పై నెలకొన్న హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Share

Leave a Comment