బాలీవుడ్ ని తాకిన భ‌ర‌త్ మేనియా

మ‌హేష్ స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది కైరా అద్వాణీ. ఇదివ‌ర‌కూ `ఎంఎస్ ధోని-యాన్ అన్‌టోల్డ్ స్టోరి` చిత్రంలో న‌టించినా రాని గుర్తింపు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న ఛాన్స్ ద‌క్కించుకుని తెచ్చుకుంది.

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ స‌హా జ‌నం క‌ళ్లు కైరా పైనే! ఈ అమ్మ‌డి ప్ర‌తి యాక్టివిటీని యూత్ నిశితంగా ప‌రిశీలిస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్య‌మాల్లో కైరా ఏం చేస్తున్నా ఫాలో అవుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సీఎం గా నటించిన భరత్ అనే నేను సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో వేరే చెప్పక్కర్లేదు. మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించిన టాపిక్ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మరియు బాలీవుడ్ లోను బాగా వినబడుతుంది.

లేటెస్టుగా కైరా డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. అయితే విశేషం ఏమిటంటే ఈ వీడియో లో కైరా తో పాటు వరుణ్ ధావన్ కూడా భ‌ర‌త్ అనే నేను పాట ‘ఓ వసుమతి ‘ కి డ్యాన్స్ చేశాడు.

ఈ వీడియో జోరుగానే సామాజిక మాధ్య‌మాల్లో షేర్ అయిపోతోంది. అంతే కాకుండా వరుణ్ ధావన్ తన ఇన్స్టాగ్రాం ఖాతా లో భ‌ర‌త్ అనే నేను నుంచి ఇంకో పాట ‘వచ్చాడయ్యో సామి ‘ కి సంబందించి డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో ని షేర్ చేశారు.

కైరా కూడా భ‌ర‌త్ అనే నేను కు సంబందించి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా వుంటుంది. మొదటి సినిమా కే ఇంతలా ప్రొమోట్ చేస్తున్న కైరా అద్వాణీ ని సూపర్ స్టార్ అభిమానులు అభినందిస్తున్నారు.

మ‌హేష్ అంత‌టి సూప‌ర్‌స్టార్‌తో అవ‌కాశం అందుకుంది అంటే కేవ‌లం గ్లామ‌ర్‌తోనే సాధ్యం కాదు. ప‌క్కాగా న‌ట‌శిక్ష‌ణ తీసుకునే బ‌రిలో దిగింది. ముంబైలో ప్ర‌తిష్ఠాత్మ‌క అనుప‌మ్ ఖేర్ న‌ట‌శిక్ష‌ణాల‌యంలో కొన్ని నెల‌ల‌పాటు త‌ధేక‌ ధీక్ష‌తో ట్రైనింగ్ తీసుకున్నాన‌ని కైరా ఇదివ‌ర‌కే వెల్ల‌డించింది. `భ‌ర‌త్ అనే నేను` రిలీజ్ వేళ ఇలాంటి గొప్ప అవ‌కాశం రావ‌డానికి కార‌కులైన‌ గురువు అనుప‌మ్ ఖేర్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంది.

Share

Leave a Comment