ఆకాశమే హద్దుగా భరత్ వసూళ్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మహేష్ బాబు తొలిసారి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఈ చిత్రంలో కనిపించాడు. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో భరత్ అనే నేను చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయబోతోంది.

విడుదలయిన ప్రతి చోట, ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. అక్కడ, ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్నిచోట్లా మహేష్ బాబు స్టామినా దెబ్బకు కలెక్షన్ రికార్డులు బద్ధలవుతున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్, అలానే తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది.

మ‌హేష్ కంచుకోట అయిన యూఎస్‌లో ఇప్ప‌టికే 3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరువు అవుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసి రూ.150 కోట్ల వ‌సూళ్ల‌కు చేరువ అవుతోంది.

భరత్ అనే నేను చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. మహేష్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది. దర్శకుడు కొరటాల మహేష్ ని మునుపెన్నడూ లేని విధంగా సూపర్ స్టైలిష్ గా ఈ చిత్రంలో చూపించారు.

గుంటూరులో నాలుగు రోజులకే నాన్ బాహబలి రికార్డును నెలకొల్పింది భరత్ అనే నేను. అయిదు రోజులకు మొత్తంగా ఆరు కోట్లకు పైగా షేర్ తో రికార్డులు సృష్టిస్తున్నాడు భరత్. కృష్ణా లో కూడా తన హవా చూపిస్తున్నాడు సూపర్ స్టార్. భరత్ అనే నేను కృష్ణా జిల్లాలో నాన్ బాహుబలి రికార్డును అధిగమించింది. మహేష్ కలెక్షన్ల ప్రభంజనం సీడెడ్‌లో కూడా కొనసాగతున్నది.

వైజాగ్‌లో కూడా సూపర్ స్టార్ మహేష్‌ కలెక్షన్ల జోరు భారీగా కనిపిస్తున్నది. గోదావరి జిల్లాలో వసూళ్లు భారీ స్థాయిలో వున్నాయి. సరైన మూవీ పడితే మహేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో భరత్ అనే నేను చూపిస్తుంది.

ఓవర్సీస్ లో భరత్ అనే నేను చిత్ర హవా కొనసాగుతోంది. గల్ఫ్ దేశాల్లో భరత్ అనే నేను జోరు చూపిస్తోంది. తిరుగులేని వసూళ్లు సాధిస్తోంది. ఆస్ట్రేలియాలో అయితే ‘భరత్ అనే నేను’ ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అక్కడ తెలుగు సినిమాల ఫుల్ రన్ రికార్డులు ఆల్రెడీ బద్దలైపోవడం విశేషం. ఇప్పటికి 405కె+ ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టి దూసుకుపోతుంది.

అన్నివర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీ రామారావు భరత్ అనే నేను చూసి మహేష్ నటనను ప్రశంసించారు. విజన్ ఫర్ బెటర్ టుమారో అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ ఒకే వేదికపై పాల్గొన్నారు.

Share

Leave a Comment