తెర వెనక ఒక్కో సీన్ అందంగా మలచడానికి

ఒక సినిమా తెర మీదకు రావడం అంటే మామూలూ విషయం కాదు. తెరపై కనిపించేది నటీనటులు మాత్రమే. కానీ తెర వెనక 24 క్రాప్ట్స్ నుండి ఎంతో మంది మనకు కనిపించకుండా సినిమా కోసం అహర్నిశలు పని చేస్తుంటారు.

ఇలా తెరపై, తెర వెనక వందల మంది కష్టపడితే ‘భరత్ అనే నేను’ లాంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ మూవీ రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది.

ఒక్కో సీన్, ఒక్కో ఫ్రేమ అందంగా మలచడానికి తెర వెనక టెక్నీషియన్లు ఎంత కష్టపడ్డారో తాజాగా విడుదలైన ‘భరత్ అనే నేను’ మేకింగ్ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. డివివి ఎంటర్టెన్మెంట్ సంస్థ ఖర్చుకు వెనకాడకుండా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించింది.

మొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించడం కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కొరటాల శివ. సమాజం పట్ల, రాజకీయాల పట్ల అటు నాయకుల్లో, ఇటు ప్రజల్లో బాధ్యత పెంచే విధంగా ఈ సినిమాని రూపొందించారు.

పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఇటు భారీ తారాగణంతో పాటు అటు వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను ఈ సినిమా కోసం ఉపయోగించారు. చిత్రంలో మ‌హేష్ పాత్ర‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

సినిమా సెల‌బ్రిటీలే కాదు రాజ‌కీయ నాయ‌కులు కూడా చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే ఈ చిత్రంలో అసెంబ్లీ సెట్ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీని త‌ల‌పించేలా వేసిన ఈ సెట్ ఎలా రూపొందించార‌నే విష‌యాన్ని ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ సురేష్ సెల్వ‌రాజ‌న్‌ వివ‌రించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ ని దర్శకుడు కొరటాల శివ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమా గానే కాకుండా మనం జీవితం లో కొన్ని మంచి విషయలాని కూడా నేర్పించే అద్భుతమైన చిత్రం గా తెరకెక్కించారు.

ఈ సినిమా ఇప్పుడు తమిళ భాషలోకి అనువాదం కానుంది. అక్కడ యూత్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేసి చిత్రాన్ని ఈ నెల 25 న విడుదల చేయనున్నారు.

Share

Leave a Comment