భరత్ సరికొత్త ప్రమోషన్ స్ట్రాటజీ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో, కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న సినిమా భరత్ అనే నేను. ఎంత పెద్ద సినిమాకైనా ఈ రోజుల్లో ప్రమోషన్స్ అవసరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే సినిమాకు సంబంధించి ఇప్పటికే కొత్త తరహా ప్రచారంతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఓథ్, విజన్ ఆఫ్ భరత్ లాంటి పేర్లతో ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించారు. ఇలాంటివి మరిన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఫస్ట్ ఓథ్ – విజన్ ఆఫ్ భరత్ లాంటి డిఫెరెంట్ స్టైల్ లో సినిమా స్థాయిని పెంచేసారు మహేష్ టీం. అదే ఉపును సినిమా రిలీజ్ అయ్యే 20 రోజుల ముందుగానే ఉండాలని అనుకుంటున్నారట చిత్ర యూనిట్.

ఆ 20 రోజుల్లో సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని ప్రేక్షకులకు తెలిసేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయట. ఏప్రిల్ 1నుంచి సినిమా విడుదలైన రోజు వరకు ఏదో ఒక రూపంలో ఈ సినిమాకి ప్రచారం కల్పించబోతున్నారని తెలుస్తోంది.

నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఇంటర్వ్యూలు అని అలాగే ప్రెస్ మీట్స్ అని మిగతా ప్రమోషన్స్ ఎలాగో ఉంటాయి. అవి కాకూండా డిజిటల్ ప్రమోషన్స్ చేయనున్నారు.

ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుక మేజర్ ప్లస్ పాయింట్. అది భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. శ్రీమంతుడు కాంబినేషన్ రిపీట్ అవుతుందని అందరిలోను అంచనాలు భారీగా ఉన్నాయి.

ఫస్ట్ వోథ్‌లోనే అద్భుతమైన మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ సాంగ్స్‌కి అంతకు మించిన రీతిలో స్వరాలను సమకూర్చారు అని వినికిడి. నేపధ్య సంగీతం మీద ప్రత్యేక ద్రుష్టి సారించారు.

ముఖ్యమంత్రిగా మహేష్ చేసే పాత్ర అందరిని ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు.

సమకాలీన రాజకీయాలతో రాబోతున్న కొరటాల దానిని ప్రజల్లోకి గనుక ఎక్కిస్తే మరో బ్లాక్‌ బస్టర్‌ను అందుకోవటం ఖాయమనే మాట వినిపిస్తోంది. మొత్తానికి రైట్‌ టైమ్‌ లో.. రైట్‌ మూవీతోనే రాబోతున్నారన్నది సినీ విశ్లేషకుల మాట.

Share

Leave a Comment