పొల్లాచ్చి వెళుతున్న మహేష్

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ పై ఇప్పటికే జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను… ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ – కొరటాల శివ కలిసి చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా కొర‌టాల మార్క్ యాక్ష‌న్‌, మెసేజ్ ఉన్న చిత్రంగా తెర‌కెక్కుతోంది.

కొంతకాలంగా ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూ వస్తోంది. అసెంబ్లీ సన్నివేశాలను .. సీఎం చాంబర్ కి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఒక ఫైట్ ను చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా హోలీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. శ్రీమంతుడు సినిమాలోని మామిడి తోట ఫైట్ సీన్స్ ను ఇది గుర్తుచేస్తోందని తెలుస్తోంది.

మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

అయితే కొరటాల టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ ని తమిళనాడు పొల్లాచ్చి లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు.. ఫ్యామిలీతో విదేశాల్లో వున్నారు. యాడ్ షూట్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన ఈ నెల 20వ తేదీన తిరిగిరానున్నాడు.

ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన షూటింగులో పాల్గొంటాడు. కైరా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాలో మహేష్ బాబు సీయంగా నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతిపక్ష నేతగా పోసాని నటిస్తుండగా, మహేష్ సెక్రటరీగా బ్రహ్మాజీ యాక్ట్‌ చేస్తున్నారన్నది ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

రవి కె. చంద్రన్‌ ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న రిలీజ్ అవబోతుంది

Share

Leave a Comment