పవర్ ఫుల్ కథ తో రానున్న భరత్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం భరత్ అనే నేను. మహేష్ ని కొరటాల శివ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

శ్రీమంతుడు చిత్రంలో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో వచ్చిన కొరటాల బ్లాక్ బాస్టర్ కొట్టాడు. మరో మారు మహేష్ కోసం పవర్ ఫుల్ కథతో భరత్ అనే నేను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.

ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కమర్షియల్ చిత్రాలలో తనదైన శైలికి సామజిక సందేశాన్ని జోడించడం కొరటాలకే చెల్లింది. ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఆయనకు విజయాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం భరత్ అనే నేను ఇంత కంటే పెద్ద రేంజ్ లో ఉండనున్నది అని వినికిడి.

ఈ చిత్రంలో ఉమ్మడి ఏపీ నేపథ్యంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. సమాజంలోని ప్రధాన సమస్యలని ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా పరిష్కరించాడో ఈ చిత్రంలో కొరటాల చూపించబోతున్నారు.

టీజర్ విడుదలయ్యాక భరత్ అనే నేను చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యమంత్రిగా స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు అదరగొడుతున్నాడు. ఇక ఈ స్టైలిష్ సీఎం సినిమాలో చేసే విన్యాసాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

భరత్ అనే నేను చిత్రంలో కొరటాల శివ ప్రధానంగా కొన్ని సమస్యలని హైలైట్ చేయనున్నట్లు తెలుస్తోంది. రైతు, ట్రాఫిక్, విద్య గురించి ఈ చిత్రంలో ప్రధానమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లలో మహేష్ పలికే డైలాగులు ఆకట్టుకోవడం ఖాయం అని సమాచారం.

ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. కొరటాల ఈ చిత్రం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. మరో బ్లాక్ బాస్టర్ ఖాయం అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. స్టుడియోలో వేసిన స్పెషల్ సెట్ లో మహేష్-కైరా తో ఓ సాంగ్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

అక్కడ ఒక సాంగ్ చిత్రీకరణ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఇంక వచ్చే నెల నుండి ప్రమోషన్స్ గ్రాండ్ స్కేల్ లో స్టార్ట్ చేయనున్నారు.

Share

Leave a Comment