‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?

మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది.

కొరటాల-మహేష్-దేవి శ్రీ కాంబినేషన్‌లో గతంలో విడుదలైన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ‘భరత్ అనే నేను’ మూవీ పై విపరీతమైన అంచనాలు వచ్చేశాయి.

ఇప్పటికే టీజర్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది. భరత్ విజన్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది.

ఫస్ట్ వోథ్‌లోనే అద్భుతమైన మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ సాంగ్స్‌కి అంతకు మించిన రీతిలో స్వరాలను సమకూర్చారు అని వినికిడి. నేపధ్య సంగీతం మీద ప్రత్యేక ద్రుష్టి సారించారు.

ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ మొదటి వారంలో వైజాగ్‌ లేదా హైదరాబాద్ లో నిర్వహించి…అక్కడే సాంగ్స్‌ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది యూనిట్. వెన్యూ తొందరలోనే ఫిక్స్ చేయనున్నరు.

అయితే సినిమాకు సంబంధించి ఇప్పటికే కొత్త తరహా ప్రచారంతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఓథ్, విజన్ ఆఫ్ భరత్ లాంటి పేర్లతో ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించారు. ఇలాంటివి మరిన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ జోడి కడుతుండగా.. ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమర్ మహేష్‌కు తండ్రిగా నటిస్తున్నారు.

మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని ది విజన్ ఆఫ్ భరత్ తో స్పష్టం అవుతుంది. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

ఈ మూవీలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

భరత్‌ అనే నేను చిత్రంపై పెరిగిపోతున్న అంచనాలతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఓ వైపు సిఎంగా డిగ్నిఫైడ్ గా క‌నిపిస్తూనే.. మ‌రోవైపు మహేష్ నుంచి మాస్ ప్రేక్ష‌కులు కోరుకునే అంశాల్ని కూడా పొందు ప‌రిచాడు కొర‌టాల శివ‌.

Share

Leave a Comment