భరత్ ప్రెస్ మీట్ సీన్ వీడియో అదిరిపోయింది

మహేష్ బాబు సినిమాలు అన్నింటిలోకి బెస్ట్ సీన్ ఏది అని ఎవరినైనా అడిగితే అందరు చెప్పేది ఒక్కడులో కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్ రాజ్ ని కొట్టడం. కాని ప్రిన్స్ మాత్రం ఇప్పటి నుంచి తనకు భరత్ అనే నేనులో ప్రెస్ మీట్ ఎపిసోడ్ లో మీడియాను ప్రశ్నించేదే ఫేవరేట్ అంటున్నారు.

దానికి కారణం కూడా లేకపోలేదు. గుండె లోతుల్లో నుంచి ఆ సంభాషణలు తన నోటి నుంచి వచ్చాయని ఇప్పుడు దానికి వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. ఈ సీన్ ఒక మిరాకిల్ గా కుదిరింది అని చెప్పారు.

నిజానికి ప్రెస్ మీట్ సీన్ కు థియేటర్లో కూడా మహేష్ చెప్పిన స్పందనే ఉంది. చాలా ఎమోషనల్ గా మహేష్ చూపించిన పెర్ఫార్మన్స్ ఒన్స్ మోర్ అనేలా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.

మనుషుల మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు అని మహేష్ చెప్పే మాటలు హైలైట్ గా నిలిచాయి. ఇంక ఐ యాం నాట్ డన్ యెట్ అని మహేష్ అంటే థెయేటర్ దద్దరిల్లింది.

మెగా స్టార్ చిరంజీవి గారికి కూడా ఈ సీన్ విపరీతంగా నచ్చింది. సినిమా చూసిన వెంటనే మహేష్ బాబుకు ఫోన్ చేసి అభినందించానని చిరంజీవి వెల్లడించారు. ఈ సినిమాలో తనకు చివర్లో వచ్చే ప్రెస్ మీట్ సీన్ చాలా నచ్చిందని, నేను స్వతహాగా ఆ సీన్‌కు కనెక్ట్‌ అయ్యానని, మహేష్ జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నప్పుడు చప్పట్లు కూడా కొట్టానని, అది ఎంతో అద్భుతంగా సీన్ అంటూ మెచ్చుకున్నారు.

అంతే కాకుండా దర్శకధీరుడు రాజమౌళి కి కూడా ప్రెస్ మీట్ సీన్ తన ఫేవరేట్ అని పేర్కోన్నారు. చాలా మంచి మూమెంట్స్ ఉన్న ఈ సినిమాలో ప్రెస్ మీట్ సీన్ ది బెస్ట్ అని చెప్పారు. మహేష్ బాబు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ప్రశంసల వర్షం కురిపించారు.

దుర్గామహల్ ఫైట్ గురించి కూడా మహేష్ ఇదే విధంగా స్పందించాడు. శ్రీమంతుడు సినిమాలో మామిడి తోట ఫైట్ ను మించి మరొకటి మా కాంబోలో ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేసారని ఇప్పుడు థియేటర్ ఫైట్ గురించి ఫాన్స్ మాట్లాడుకుంటూ ఉంటే గర్వంగా ఉందని మహేష్ పొంగిపోయాడు.

ట్రాఫిక్ ఎప్పుడైనా ఇబ్బంది తలెత్తినప్పుడు భరత్ అనే నేనులోని సీన్స్ గుర్తు చేసుకుంటున్నారట అభిమానులు. మొత్తానికి ఆచరణ సాధ్యం కాకపోయినా కనీసం అలోచన చేసేందుకైనా భరత్ అనే నేను అవకాశం కల్పించడం మెచ్చదగిందే.

Share

Leave a Comment