రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు తర్వాత కొరటాల – మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడం , మొదటిసారి మహేష్ ముఖ్య మంత్రి పాత్రలో కనిపిస్తుండడం తో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రంలోని ఫస్ట్ ఓత్, విజన్ ఆఫ్ భరత్ యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలానే ఇటీవల విడుదలయిన రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్నాయి.

నిన్న విడుదలైన ‘వచ్చాడయ్యో సామి’ అనే పల్లవితో సాగే పాట ఐతే ఒక సంచలనమే అని చెప్పాలి. దీంతో భరత్ అనే నేను పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాను అన్ని చోట్ల భారీ సంఖ్య లో రిలీజ్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ఓవర్సీస్లో ముఖ్యంగా అమెరికా లో కూడ అదే స్థాయి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ మూలానే ఆయన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ భారీ స్థాయిలో జరిగింది.

అమెరికా లో కేవలం ప్రీమియర్స్ షోలే దాదాపు 2000 థియేటర్స్ ప్లాన్ చేసారంటే సినిమా ఏ స్థాయి లో రిలీజ్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ భారీస్థాయి విడుదల వలన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సైతం చిత్రం భారీ స్థాయిలోనే రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకుడు కావడం, సూపర్ స్టార్ మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో గట్టి అంచనాలున్నాయి.

‘భరత్ అనే నేను’ చిత్రానికి సంబంధించిన పూర్తి ఆడియో ఏప్రిల్ 7న జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేయనున్నారు. ‘భరత్ బహిరంగ సభ’ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున దీన్ని నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 20న భారీ స్థాయిలో భరత్ అనే నేను విడుదల కానుంది.

Share

Leave a Comment