విడుదలకి ముందే భరత్ సంచలనాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ సీఎం గా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా వచ్చే శుక్రవారం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మీద భారీ అంచనాలున్నాయి. భరత్ అనే నేను విడుదలకు ముందే సంచలనాలకు తెరతీసింది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించేస్తుంది.

భరత్‌ అనే నేను ప్రీ రిలీజ్‌ వేడుక సభలో ‘ఇక నుంచి తెలుగు చిత్రసీమ ట్రెండ్‌ మారుతుంది’ అని ఓ కొత్త ప్రకటన చేశారు సూపర్ స్టార్ మహేష్. ఈ మాట ఆయన సినిమా షోలు ప్రదర్శనలో ట్రెండ్‌ మారుతున్నట్టుంది.

భరత్‌ అనే నేను ను విదేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారట. 2000లకుపైగా స్క్రీన్లలో చిత్రం ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం.

అలాగే అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్యకు మించి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కూడా తెలిపింది. యుఎస్ లో మహేష్ బాబు సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కారణంగా అక్కడ అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన సినిమాల రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒక వేళ ఫ‌స్ట్ వీకెండ్ షోలు హౌస్ ఫుల్ అయితే 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌చ్చి ప‌డ‌తాయి. సినిమాకు హిట్ టాక్ వ‌స్తే చాలు మ‌హేష్ దున్నేస్తాడు. హైప్ విషయంలో తాను ప్రిన్స్ అని మహేష్ మరోసారి రుజువు చేస్తున్నాడు.

అలాగే యు.కె.లో కూడా ఏ తెలుగు సినిమా విడుదలవ్వని థియేటర్లో రాబోతున్నాడు భరత్‌. దీనికి తోడు ఆస్త్రేలియా లో ఏకంగా ఏ భారతీయ సినిమాకి సాధ్యం కాని విధంగా విడుదలౌతుంది భరత్ అనే నేను. ఇవన్నీ చూస్తుంటే ఈసారి విదేశాల్లో లో సూపర్ స్టార్ సునామి స్రుష్తించే లా వున్నాడు.

Share

Leave a Comment