తిరుగులేని క్రేజ్ తో కరియర్ బెస్ట్ రికార్డ్

కొరటాల శివ దర్శకత్వం లో మహేష్ బాబు నటించిన భరత్ అనే లాస్ట్ వీక్ ప్రేక్షకుల ముందుకు రాగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా సరికొత్త లెక్కలను సూపర్ స్టార్ మహేష్ సరిచేస్తున్నాడు.

సినిమాలో మంచి బలమైన కంటెంట్ ఉండడం..ఒక సినిమాకు కమర్షియల్ హంగులతో పాటు, మంచి సోషల్ మెసేజ్ ను జోడించి అద్భుతంగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాడు. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్ల దిశగా పయనిస్తోంది.

ఓవర్సీస్ ని నైజం గా మార్చుకున్న తెలుగోడి హవా దేశవిదేశాల్లో అజేయంగా కొనసాగుతుందని భరత్ రిపోర్ట్ చెబుతుంది. అమెరికా లో మహేష్ తన ఆల్ టైం బెస్ట్ కలెక్షన్స్ ని ఇంత తక్కువ సమయం లో సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. కేవలం అమెరికా లో (కెనడా కలపకుండా) 3 మిలియన్ మార్క్ ని అందుకున్నడు.

ఇది మహేష్ కెరీర్ లో నే అత్యుత్తమైన కలెక్షన్ రికార్డ్. ఇంక మొత్థం అమెరిక మరియు ఉత్తర అమెరిక (కెనడా) తో కలిపి ఈ కౌంట్ 3.5 మిలియన్ మార్క్ కి చేరుకుంటుంది. ఇలా ప్రతీ సినిమాకి కొత్త బెంచ్ మార్క్ స్రుష్టిస్తున్నాడు సూపర్ స్టార్.

మహేష్ బాబు కి అమెరికా లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల తోనూ మిలియన్ మార్కును ఈజీగా అందుకుంటాడు. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్‌తో దుమ్ము దులుపుతోంది. ఇప్ప‌టికే 3 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేసి 3.5 మిలియ‌న్ డాల‌ర్ల దిశ‌గా దూసుకుపోతోంది.

ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ పరిధులలో గల ప్రాంతాల్లో ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేయడం విశేషం. అతి తక్కువ సమయంలో నూట అరవై కోట్ల గ్రాస్ ను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పి ఓవర్సీస్ లో 4.65 మిలియన్ మార్క్ (31crs) ను అవలీలగా అందుకోవడం విశేషం.

భరత్ అనే నేను ఒక్క అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. ఆస్ట్రేలియా లాంటి చిన్న మార్కెట్‌లో కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించడం సినీ వర్గాలను షాక్ గురి చేస్తున్నది.

విదేశాల్లో మహేష్ బాబు మాయ..అంతర్జాతీయ మార్కెట్‌లో తుపాను అని పలు ట్రేడ్ అనలిస్టులు సైతం మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మహేష్ సినిమా అన్ని చోట్లా జోరు చూపిస్తోంది. తిరుగులేని వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి బౌండరీ అవతల మహేష్ బ్యాటింగ్ మామూలుగా లేదు.

ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే, దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబే అని చెప్పాలి. ఇది నిర్వివాదమైన అంశం గనుకనే… జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ గా ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్పారు.

Share

Leave a Comment