భరత్ దెబ్బకు యూట్యూబ్ షేక్

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’.

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను టీజర్ రానే వచ్చింది. ‘ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో ‘భరత్ అనే నేను’ సినిమా టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ విజన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

‘భరత్ అనే నేను’… అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్.. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే మనం మనుషులం అనిపించుకోం.. ప్రామిస్’ అంటూ మరోసారి సొసైటీకి మెసేజ్ ఇస్తుండటంతో ఈ టీజర్ అటు సినీ రాజకీయ, వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

‘వియ్‌ ఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళకీ భయం, బాధ్యత ఉండాలి… ప్రామిస్‌’ అంటూ మహేష్‌ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది.

విజ‌న్ చివ‌ర్లో ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ రామ్ అనే బోర్డును ఓ వైపుగా మ‌హేష్ తిప్ప‌డం అదిరిపోయాయి. విజ‌న్ కు హైలైట్ గా నిలిచిన షాట్స్ ఇవే.

ఈ టీజర్‌ యూట్యూబ్లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగుల దెబ్బకు….ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన ట్రైలర్, టీజర్ వ్యూస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

టీజర్ విడుదలై రెండు రోజులు గడవక ముందే యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్ని క్రాస్ చేసి సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.

ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం స్వీకారంలో ఎన్నో చెబుతాడు. ఆ ప్రామిస్ ఎంతవరకు నెరవేరుతోంది అనే కాన్సెప్ట్ చుట్టూ కథ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.

మహేష్ బాబు.. ముఖ్యమంత్రిగా అద్భుతంగా సెట్టయ్యారు. నిజంగా ఇలాంటి యంగ్ ముఖ్యమంత్రి ఉంటేనా.. అనేంతగా మహేష్ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ టీజర్‌కు నీరాజనం పడుతున్నారు.

ఈ టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఈ సినిమాలో కూడా మంచి సందేశం ఉండబోతోందన్నది అర్థమవుతోంది.

మరి ఈ సినిమాకి కొరటాల డైరెక్షన్ ఎంత హైలెట్ గా నిలవనుందో… మహేష్ బాబు లుక్ అండ్ నటన అంతే హైలెట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Share

Leave a Comment