అదిరిపోయిన సెట్ లో …

ఏప్రిల్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న కొరటాల – మహేష్ ల “భరత్ అనే నేను” సినిమా శరవేగంగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తుండగా, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులను కూడా సమ్మోహితులను చేయడంలో సక్సెస్ కావడంతో, ఈ ఏడాది బిగ్గెస్ట్ సమ్మర్ బొనంజాగా ‘భరత్ అనే నేను’ నిలవనుంది.

షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ (సెవెన్ ఏకర్స్) స్టుడియోస్ లో జరుగుతోంది. స్టుడియోలో వేసిన స్పెషల్ సెట్ లో మహేష్-కైరా తో ఓ సాంగ్ సీక్వెన్స్ తీస్తున్నారు. రాజుసుందరం దీనికి కొరియోగ్రాఫర్.

ఈ పాట విజువల్ గా సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అంటోంది చిత్ర యూనిట్. ఈ పాట సెట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో కైరా పోస్ట్ చేసారు. కలర్ ఫుల్ గా కనపడుతోన్న ఈ సెట్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు.

ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఒక సాంగ్ చిత్రీకరణ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఇంక వచ్చే నెల నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

ఈ చిత్రంలో ఉమ్మడి ఏపీ నేపథ్యంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. సమాజంలోని ప్రధాన సమస్యలని ముఖ్యమంత్రిగా మహేష్ ఎలా పరిష్కరించాడో ఈ చిత్రంలో కొరటాల చూపించబోతున్నారు.

ప్రధానంగా ట్రాఫిక్, విద్య సమస్యల గురించి ఈ చిత్రంలో ప్రధానమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లలో మహేష్ పలికే డైలాగులు ఆకట్టుకోవడం ఖాయం అని సమాచారం.

టీజర్ విడుదలయ్యాక భరత్ అనే నేను చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యమంత్రిగా స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు అదరగొడుతున్నాడు. ఇక ఈ స్టైలిష్ సీఎం సినిమాలో చేసే విన్యాసాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. కొరటాల ఈ చిత్రం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. మరో బ్లాక్ బాస్టర్ ఖాయం అని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Comment