భరత్ తమిళ వెర్షన్ విడుదల తేదీ ఖరారు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. మహేష్ కెరియర్లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో ను తన సత్తా చాటింది.

ఈ సినిమా ఇప్పుడు తమిళ భాషలోకి అనువాదం కానుంది. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా తో తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. అక్కడ యూత్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఈ సినిమా తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేసి చిత్రాన్ని ఈ నెల 25 న విడుదల చేయనున్నారు. మొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించడం కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు.

ఇప్పటికే విడుదలైన ‘భరత్ అనే నేను’ తెలుగు వెర్షన్ తమిళనాడులో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది.అంతే కాదు అక్కడ ఆల్ టైం రికార్డు స్రుష్టించాడు మహేష్. ఒక్క చెన్నై లోనే ఈ సినిమా రూ.1.65 కోట్ల షేర్ ని సాధించి ‘బాహుబలి 2’ రికార్డుని క్రాస్ చేసింది.

చెన్నైలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది నిలిచింది. ఇప్పటి వరకు తమిళనాడు లో బాహుబలి తప్పితే ఏ సినిమా సాధించని రికార్డ్ లెవల్ లో 4 కోట్ల గ్రాస్ మార్క్ ని తమిళనాడులో సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ ఫోకస్ నెక్స్ట్ మూవీపై పడింది. మహేష్ బాబు తదుపరి చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు.

మహేష్ – సుకుమార్ కాంబినేషన్ క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిన విషయమే. మరొక్క కొత్త రకం కథ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడానికి ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, మహెష్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్ని 2019 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు.

Share

Leave a Comment