ఒక ఫైట్ ..3 పాటలు..

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు  సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.  ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోంది.

ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకూ తమిళనాడులోని ‘కారైకుడి’లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  దీంతో 90 శాతం టాకీ పార్ట్ పూర్తవుతుంది.

మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను జనవరిలో చిత్రీకరించనున్నారు. అయితే మహేష్ సినిమా గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

మహేష్ తన అభిమానులకు కొత్తసంవత్సర కానుకగా భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ ని డిసెంబర్ 31 సాయంత్రం రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారని…

అలాగే ఏప్రిల్ లో వేరే రెండు సినిమాలు  రిలీజ్ కానుండడంతో  “భరత్ అనే నేను” రిలీజ్ డేట్ మారనుందని రూమర్స్ వచ్చాయి.

అందువలన ఈ ‘భరత్ అనే నేను’ రిలీజ్ డేట్ మార్చనున్నారనీ, రెండు వారాల ముందుగానే విడుదల కానుందనే ప్రచారం జరిగింది.

తాజాగా ఈ విషయంపై ఈ సినిమా టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని , మహేష్ ఫస్ట్ లుక్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. 

ఈ సినిమా రిలీజ్ డేట్  విషయంలో మార్పు జరగనున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే ఏప్రిల్ 27వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతుందని స్పష్టం చేశారు. 

తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకొనే కొరటాల ఈ సినిమాలో విద్యా వ్యవస్థ మరియు పేదరికం గురించి చర్చించబోతునట్లు తెలుస్తోంది.

ఇందులో తొలి సారి మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమా రికార్డుల మోత ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.

ఫ్యాన్సీ రేటుకు లహరి మ్యూజిక్ కంపెనీ హక్కులను సొంతం చేసుకుందట. దీంతో సినిమాపై ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా బిజినెస్ ఏ స్థాయిలో ఉండబోతోందో అని ట్రేడ్ వర్గాల వారు ఆలోచిస్తున్నారు.

Share

Leave a Comment