రికార్డులన్నీ బద్దలు కొడుతున్న భరత్

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను టీజర్ రానే వచ్చింది. నిన్నటి నుంచి చిత్ర యూనిట్ టీజర్ కి సంబందించిన పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని రేపింది.

ఈ టీజర్‌ యూట్యూబ్, ఫేస్ బుక్‌లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగుల దెబ్బకు….ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన ట్రైలర్, టీజర్ వ్యూస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

కేవలం 19 గంటల్లోనే 10 మిలియన్ (కోటి) డిజిటల్ వ్యూస్ సాధించింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్. ఇందులో 7 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా రాగా, 3 మిలియన్ వ్యూస్ ఫేస్ బుక్ ద్వారా వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘డివివి ఎంటర్టెన్మెంట్స్’ ప్రకటించింది.

చిన్నపుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. వాడిని మనిషి అనరు అని మహేష్ ఇంగ్లీష్ లో చెబుతుండడంతో సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

‘వియ్‌ ఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఎ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళకీ భయం, బాధ్యత ఉండాలి… ప్రామిస్‌’ అంటూ మహేష్‌ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ఈ టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి.

సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఈ సినిమాలో కూడా మంచి సందేశం ఉండబోతోందన్నది అర్థమవుతోంది.

ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం స్వీకారంలో ఎన్నో చెబుతాడు. ఆ ప్రామిస్ ఎంతవరకు నెరవేరుతోంది అనే కాన్సెప్ట్ చుట్టూ కథ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.

యంగ్ సీఎం, స్టైలిష్ సీఎం, విజన్ ఆఫ్ సీఎం, డ్రెస్సింగ్ స్టయిల్ ఇలా అన్ని విషయాల్లో మహేష్ బాబు సీఎం లుక్ సూపర్ అన్నట్టుగా వుంది. మరి చేసిన ప్రమాణాలను తప్పకుండా ఉండేందుకు మహేష్ సీఎంగా చేసిన పనులేమిటో….ఇట్టే అర్ధమవుతుంది.

భరత్ అనే నేను… అంటూ రాష్ట్ర రాజకీయాల్లో తాను చేసిన ప్రమాణాలను తప్పకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండేందుకు. అడుగడుగునా వచ్చే కష్టాలను ఎదుర్కొంటూ ప్రజలతో ఎలా మమేకం అయ్యాడో అనేది ఈ ‘విజన్ ఆఫ్ భరత్’ లో మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.

మరి కొరటాల ఎప్పటిలాగే ఒక సామాజిక సమస్యను ఎత్తి చూపిస్తూ దాన్ని ఎలా సాల్వ్ చెయ్యాలో కూడా చూపించేట్టుగానే ఉంది ఈ సినిమా. టాలివుడ్ మొత్తం భరత్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మరి ఈ సినిమాకి కొరటాల డైరెక్షన్ ఎంత హైలెట్ గా నిలవనుందో… మహేష్ బాబు లుక్ అండ్ నటన అంతే హైలెట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Share

Leave a Comment