మొదటి స్థానంలో భరత్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు మహేష్ స్టైల్, నటనని అభిమానిస్తారు. వయసు పెరిగేకొద్దీ మహేష్ అందం పెరుగుతోందే కానీ తగ్గడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 106 ఏళ్ల వయసున్న మృద్ధురాలికి కూడా మహేష్ పై అభిమానం ఉందంటే ఆయనకు అన్ని వయసుల అభిమానులు ఉన్నట్లు స్పష్టమౌతుంది.

ప్రతీ సంవత్సరం, మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ తమ టాప్ టెన్ హ్యాష్ ట్యాగ్ లను విడుదల చేస్తుంది. ఎంత మంది ఏ హ్యాష్ ట్యాగ్ ను ఎక్కువ గా వాడారో దిని బట్టి అర్ధమవుతుంది. ఈ ఏడాది కూడా ట్విట్టర్ ఈ టాప్ టెన్ హ్యాష్ ట్యాగ్ జాబితాను విడుదల చేసింది. మహేష్ బాబు కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ టాలీవుడ్ నుంచి మొదటి స్థానంలో ఉంది.

ఈ ఏడాది విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘భరత్ అనే నేను’ ఈ హ్యాష్ ట్యాగ్ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. అంటే టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది వాడిన ట్యాగ్ భరత్ అనే నేను అనమాట. మహేష్ ఈ మూడక్షరాల పేరువింటే చాలు ఆయన అభిమానులు పులకించిపోతుంటారు. అమ్మాయిలకు ఆయన ఓ కలల రాజకుమారుడు. యువతకు ఆయనో పోకిరి.

ఆయన క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంక సోషల్ మీడియాలో ఆయనను కొట్టేవారే లేరు. అది ఆయన ఫాలోయర్స్ ను చూస్తే తెలిసిపోతుంది. ట్విట్ట‌ర్‌లో మహేష్ కు ఏడు మిలియన్ మంది కి పైగా ఫాలోవ‌ర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

దక్షిణాది చిత్రసీమలో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న మహేష్ కి దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ ఉంది. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్ మహేష్ బాబు. ఈ లిస్ట్ తో తన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో మరో సారి ఋజువు చేసారు సూపర్ స్టార్.

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ సినిమా “మహర్షి”తో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు 25వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘మహర్షి’ అన్నీటికంటే ముందు వరుస లో ఉంటుంది.

ఇక మహర్షి యొక్క షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Share

Leave a Comment