థియేటర్ దద్దరిల్లేది అని ప్రశంసల వర్షం

సీఎం భరత్ 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తున్నాడు. భరత్ అనే నేను మూవీ కలెక్షన్ల పరంగా మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. కొరటాల ఈ సినిమాతో ప్రజలు, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపారు.

ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సీన్లను తొలగించారు. ఈ అన్ కట్ సీన్లను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌లో ఉంచింది. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎందుకు తీసేసారు, ఇవి సినిమా లో ఉంటే థియేటర్ దద్దరిల్లేది అని అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల పేరిట లక్షలు లక్షలు దోచుకోవడాన్ని ‘భరత్’లో తప్పుబట్టారు. విద్య అనేది అమ్ముకోవడానికి కాదని, అందరికీ చదువు అందాలనే సందేశాన్నిచ్చారు. దీనికి సంబంధించి సినిమాలో కేబినెట్ మీటింగ్ సీన్ ఉండగా..

విద్యావ్యవస్థపై ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం జరిపిన తరువాత.. దానికి కంటిన్యూగా మరో సీన్ ఉందట. రాష్ట్రంలో టాప్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్, విద్యాశాఖామంత్రి కుమారుడు అర్జున్ లు ముఖ్యమంత్రిని కలవడానికి వస్తారు.

సీఎంతో కార్పొరేట్ యాజమన్యాల భేటీ సీన్‌ను సినిమాలో చేర్చలేదు. సార్ మీకేమన్నా కావాలంటే మేమందరం కలిసి ఇచ్చేస్తాం సార్ అన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకు చెంప చెల్లుమనిపించే సీన్ అద్భుతంగా ఉంది.

ఈ చిత్రంలో రైతుతో మహేష్ బాబు మాట్లాడే మరో సన్నివేశాన్ని కూడా తొలగించారు. కరవు కోరల్లో దేవుడిపై భారం వేసి అరక పట్టిన రైతన్నతో మహేష్ బాబు మాట్లాడే సీన్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. అధికార యంత్రాంగం ఎలా పని చేస్తోందో చెప్పేలా ఉంది.

ఈ సినిమాలో అసెంబ్లీలో మహేష్ బాబు మాట్లాడే మరో సన్నివేశాన్ని కూడా తొలగించింది. అసెంబ్లీలో బడ్జెట్ సీన్.. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో మహేష్ ఇచ్చే వివరణ మాత్రం ఆకట్టుకుంటుంది. నిజమైన అసెంబ్లీ ని తలపించేలా అధ్బుతంగా చిత్రీకరించారు.

ఇంకా రచ్చబండ దగ్గర ఒక మహిళ తో మహేష్ సంభాషణ జరిపే సీన్ కూడా పోస్ట్ చేసారు. ఈ సీన్ సినిమాలో పెట్టకుండా డిలీట్ చేశారు. నిడివి ఎక్కువైందని డిలీట్ చేశారా అన్నది తెలియాలి. ఇక భరత్ లో ప్రతి సీను హైలైటే అని చెప్పొచ్చు. సినిమా లో లేని కొన్ని సీన్స్ ని నిన్న డీ.వీ.వి. వారు అన్ కట్ సీన్స్ పేరుతో నెటిజన్స్ కోసం రిలీజ్ చేయడం తో మహేష్ ఫాన్స్ అందరూ సంతోషంగా ఉన్నారు.

Share

Leave a Comment