అలాంటి మ్యాజిక్ తో వచ్చాడయ్యా సామి

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వానీ హిరోయిన్ గా కొర‌టాల శివ తెర‌కెక్కించిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. మ‌హేష్ కెరియ‌ర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గా నిలిచింది.

ఓవ‌ర్సీస్‌లోను ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్లే రాబ‌ట్టింది. ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్న మేక‌ర్స్ తాజాగా ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ అభిమానుల‌ని ఏ రేంజ్‌లో అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

లుంగీ, తలకి పాగా చుట్టుకుని నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేష్ బాబు కనిపిస్తూ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ సంగీతం, కొరటాల టేకింగ్, మహేష్ బాడి లాంగ్వేజ్ మళ్లీ శ్రీమంతుడు లాంటి మ్యాజిక్ తో వచ్చాడయ్యా సామి అని అందరూ అన్నారు.

మహేష్ ప్రజా నాయకుడిగా జనాలతో కలసి ఆడి పాడే సందర్భంలో ‘వచ్చాడయ్యో సామి’ సాంగ్ సినిమా లో వస్తుంది. ఈ సాంగ్ అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. పంచె కట్టులో మహేష్ అలరిస్తున్నాడు. వచ్చాడయ్యో సాంగ్ భరత్ అనే నేను ఆల్బంలోనే సూపర్ హిట్ గా నిలిచింది.

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా చూసి వచ్చాక మనందరి రియాక్షన్స్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్, డైరెక్టర్ ప్రామిస్ ని నిలబెట్టుకున్నారు అండ్ మెనీ మోర్. బట్ బెస్ట్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఇలాంటి సీయం ఉంటే ఎంత బాగుణ్ణు అని. అంతలా ఈ సినిమా ఆకట్టుకుంది.

ఇండియా లోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. మహేష్ కి నేషనల్ లెవెల్ లో ఎనలేని క్రేజ్ ఉంది. భరత్ అనే నేను తో టాలివుడ్ కి మన బౌండరీల అవతల సరికొత్త మార్కెట్ ను కూడా పరిచయం చేసిన ఘనత మహేష్ కే దక్కుతుంది.

ఏప్రిల్ 20న విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల‌లో ఘన విజయం సాధించింది. ఇక త‌మిళ‌నాట భ‌ర‌త్ ఎనుము నాన్ పేరుతో విడుద‌ల కానుంది. ఇక కేర‌ళ‌లోను ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

దిల్‌రాజు అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ చేస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో మహేష్‌ కొత్తగా కనిపించనున్నాడట. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Share

Leave a Comment