వచ్చాడయ్యో సామి వీడియో అదిరింది

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 20 న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రంగం సిద్ధమైంది.

కొరటాల, మహేష్ బాబు సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందడంతో అభిమానుల్లో కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ‘భరత్ అనే నేను’ థియేటర్లకు రానుంది. మహేష్ అభిమానులంతా ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే బ్లాక్ బస్టరైన ‘వచ్చాడయ్యో సామి’ వీడియో ప్రోమోను విడుదల చేశారు. సూపర్‌ స్టార్‌ తన ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ప్రోమోను వదలడం విశేషం.

లుంగీ, తలకి పాగా చుట్టుకుని నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేష్ బాబు కనిపిస్తూ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఈ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడటం విశేషం.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ సంగీతం ఈ పాటని జనం నాల్కులపై నిలబెట్టాయనే చెప్పాలి. సినిమా రిలీజ్ కి ముందు ఈ సూపర్ హిట్ సాంగ్ ప్రోమోను వదలడం మరింతగా కలిసొచ్చే అంశం.

ఈ సాంగ్ అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. పంచె కట్టులో మహేష్ అలరిస్తున్నాడు. వచ్చాడయ్యో సాంగ్ భరత్ అనే నేను ఆల్బంలోనే సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు సినీ చరిత్రలో భరత్ ఓ కొత్త అధ్యాయం లిఖించడం ఖాయం అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

అయితే ఇప్పటికే నెలకొన్న భారీ అంచనాలకు మరింత బూస్టింగ్ ఇస్తూ ఓ హామీ ఇచ్చారు డీవీవీ దానయ్య. ‘‘మా బ్యానర్‌కి ‘భరత్ అనే నేను’ గర్వపడే సినిమా. అసెంబ్లీ సెట్‌కి 2 కోట్లు ఖర్చు పెట్టాం. వచ్చాడయ్యో సాంగ్ కోసం 4 కోట్లు పెట్టాం.

దానయ్య అనే నేను.. ‘భరత్ అనే నేను’ అందర్నీ అలరిస్తుందని హామీ ఇస్తున్నాను’’ అన్నారు. దానయ్య ఇచ్చిన ఈ హామీతో సూపర్‌ స్టార్‌ మహేష్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపయింది.

Share

Leave a Comment