భరత్ విజువల్ ఎఫెక్ట్స్

కొరటాల శివ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటంచిన ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టించింది భరత్ అనే నేను. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో 200 కోట్ల క్లబ్‌లో త్వరగా చేరిన సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత దూకుడుగా కలెక్షన్లు రాబట్టింది. బాహుబలి సినిమా తర్వాత అంత వేగంగా యూఎస్‌లో కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసాడు భరత్.

ఇప్పుడు ‘భరత్ అనే నేను’ వి.ఎఫ్.ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో ను ఆ చిత్ర గ్రాఫిక్ వర్క్స్ కి పని చేసిన ప్రఖ్యాత పిక్సెలాయిడ్ స్టూడియో విడుదల చేసింది. ఈ సినిమాలో ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ వాడారో ఈ వీడియో లో చూపించారు. మొత్తం గ్రాఫిక్ వర్క్ ని ఈ వీడియో లో కవర్ చేసినట్లుగా లేదు.

ఇంకో వి.ఎఫ్.ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో ను బహుశా త్వరలో విడుదల చేస్తారేమో. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే ఈ వీడియో ను వైరల్ చేసేస్తున్నారు. విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది భరత్ అనే నేను. మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ.190 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ దక్కించుకున్నట్టు వెల్లడించారు. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు ప్రకటించింది సినిమా యూనిట్.

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా డెహ్రాడూన్ లో జరుగుతోంది. జూన్ 17వ తేదీన అక్కడ మొదలైన షెడ్యూల్ రీసెంట్ గా పూర్తయింది.

మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ ల మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను డెహ్రాడూన్ లో చిత్రీకరించారు. జూన్ 17న మొదలైన డెహ్రాడూన్ షెడ్యూల్ శుక్రవారంతో ముగిసింది. 20 రోజుల పాటు చిత్రీకరించాక మహేష్25 టీమ్ మొత్తం హైదరాబాద్ తిరిగి వచ్చారు.

ఏప్రిల్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిని దర్శకుడు వంశీ పైడిపల్లి కొట్టిపారేస్తున్నారు. భరత్ అనే నేను తరహాలో ఇందులో కూడా మెసేజ్ ఉంటుందని సమాచారం. దిల్ రాజు, అశ్విన్ దత్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మహేష్ 25వ చిత్రం మీద ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కనక హైప్ భీభత్సంగా ఉంది.

Share

Leave a Comment