అదిరిపోయిన భరత్ అనే నేను విజన్

శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా “భరత్ అనే నేను”. మార్చి 6 సాయంత్రం 6 గంటలకు ‘విజన్ ఆఫ్ భరత్’ పేరుతో ఈ సినిమాకు టీజర్ ను విడుదల చేశారు మూవీ టీమ్.

అభిమానులను థ్రిల్ గురిచేసేలా ప్రిన్స్ విజన్ ఆఫ్ భరత్‌ను రూపొందించారు. రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన భరత్ విజన్‌ ‘భరత్ అనే నేను’ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది. టీజర్ ను పవర్ ఫుల్ గా కట్ చేశారు మూవీ టీమ్. చితగ్గొట్టేసిన ‘భరత్ అనే నేను’ విజన్ మీరూ చూడండి..!

‘ది విజన్ ఆఫ్ భరత్’ అని విడుదల చేసిన ఈ టీజర్ సూపర్ స్టార్ మహేష్ స్థాయిని మరో లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది.

టీజర్ చూశాక.. ఈ సమ్మర్‌లో ఛార్జ్ తీసుకునే ముఖ్యమంత్రి భరత్ రామ్‌ పరిపాలన కోసం ప్రజలు (ప్రేక్షకులు) వెయిట్ చేయడం ఖాయం.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతుంది. ప్రస్తుత విద్యా విధానం.. దానిని ఓ యువ ముఖ్యమంత్రి ఏ విధంగా మార్చాడు అనే దానిపై సినిమా నడుస్తుందున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

శ్రీమంతుడు తర్వాత మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘భరత్ అనే నేను’ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మాజీ, ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

Share

Leave a Comment