అనూహ్యంగా లైక్ షేర్ ల వర్షం

భరత్ అనే నేను తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరుగులేని విజయం అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు టాలివుడ్ సినిమాల మార్కెట్ పరిధిని తెలుగు రాష్ట్రాల బోర్డర్ అవతల కూడా నిలబెట్టిన మొట్ట మొదటి తెలుగు హీరో అని చెప్పొచ్చు.

యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మేడియా లో సూపర్ స్టార్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మహేష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. మహేష్‌బాబు 25వ చిత్రం గురించి అనుకుంటున్నారా? లేదండి, భరత్ అనే నేను తమిళ వర్షన్ గురించి. అదేంటి, విడుదల అయి చాల రోజులు అయింది అనుకుంటున్నారా..అవును, ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయి కొత్త రికార్డులు స్రుష్టిస్తుంది.

ఫేస్ బుక్ లో ఒక తమిళ పేజి లో మహేష్ బాబు భరత్ ఎనుమ్ నాన్ లో ని ‘అసెంబ్లీ సీన్’ క్లిప్ పోస్ట్ చేసారు. దానికి టోటల్ ఇండియా వైడ్ అధ్బుతమైన స్పందన లభించింది. విపరీతంగా షేర్ లు, లైక్ ల వర్షం కురుస్తుంది.

సుమారుగా 1.5 మిలియన్ (1,445,714) వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. అంతే కాదు ఈ వీడియో ని దాదాపు గా యాబై వేల మంది లైక్ చేసారు, ఇంకొ యాబై వేల మంది షేర్ చేసారు.

ఈ వీడియో చూసి సూపర్ గా ఉంది, మహేష్ బాబు అంటే మాకు కూడా ఇష్టం, ఈ సినిమా లింక్ ఇవ్వండి మేము కూడా చూస్తాం అని తమిళ అభిమానులే కాకుండా నార్త్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. దీని బట్టి మహేష్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడే కాదు మహేష్ అంటే టోటల్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉంది. దటీజ్ సూపర్ స్టార్ మహేష్.

ఓవర్‌సీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ప్రిన్స్ సొంతం. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలో తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్తిండియా మార్కెట్లో లో ఈ మధ్య మన సౌత్ సినిమాల గురించి మాట్లాడేలా చేసిన హీరో మహేష్ బాబు.

ఇక ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం గురించి అంతా చర్చించుకుంటున్నారు. మహేష్‌ ప్రతిష్టాత్మక, మైలురాయి చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

Share

Leave a Comment