భరత్.. ముందే వచ్చేస్తున్నాడా?

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమా ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 27 న విడుదల కానుందని చిత్ర నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు.

కానీ ఇప్పుడు సినిమాను అనుకున్న డేట్ కంటే ముందే తీసుకొని రావాలనే ఆలోచన చేస్తున్నారట. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను కూడా వేగవంతం చేశారట యూనిట్ .

సినిమాను కాస్త ముందుకు జరిపి రెండో వారం లో విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ‘భరత్ అనే నేను’ చిత్ర యూనిట్ ఉంది.

ఏప్రిల్ 27న మరో సినిమా కూడా విడుదల కానుంది. అందుకే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు వస్తే రెండు సినిమాల కలెక్షన్లు దెబ్బతినే అవకాశముంది.

కలక్షన్లు అనే కాకుండా రెండు సినిమాలకి థియేటర్స్ విషయం లో కూడా సమస్య తలత్తే ఆస్కారం ఉంది.

కాబట్టి మహేష్, కొరటాల సినిమాను కొంచెం ముందుకు జరిపితే ఎలా ఉంటుందని చిత్ర యూనిట్ ఆలోచన లో ఉందని ఇండస్ట్రీ టాక్.

అయితే ఈ వార్తలో ఏ మేరకు వాస్తవముందో తెలియాలంటే యూనిట్ సభ్యుల నుండి అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాలి.

మొదట్నుంచీ కూడా మహేష్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతుంటారు. ఆయనికి ఉన్న క్రేజ్ అలాంటిది.

అందుకే ఎప్పట్లాగే సెట్స్‌పై ఉన్న మహేష్‌ సినిమా ‘భరత్‌ అనే నేను’ గురించి అటు ప్రేక్షకులు, ఇటు పరిశ్రమ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.

కొన్ని సన్నివేశాల్లో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. విజయవంతమైన ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ – కొరటాల కలయికలో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్, కైరా అద్వాని జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

తాజాగా రజినీకాంత్ 2.0 చిత్ర విడుదల ఏప్రిల్ అని ప్రకటించడంతో ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటున్న తెలుగు సినిమాల చిత్ర నిర్మాతలలో గందరగోళం మొదలైంది.

ముఖ్యంగా ఈ విషయంలో నా పేరు సూర్య, భరత్ అనే నేను చిత్రాల నిర్మాతలు మాట్లాడుకుని ఒక కొలిక్కి వచ్చారని, 2.0కి ధియేటర్ల విషయంలో వీరు టాలీవుడ్ పవర్ చూపించాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు తాజాగా వచ్చిన విషయం తెలిసిందే.

– ఆంధ్రజ్యోతి దిన పత్రిక

Share

Leave a Comment