మళ్ళీ మొదలయింది…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే హాలీడే నుండి తిరిగొచ్చి ‘భరత్ అనే నేను’ షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈరోజు నుండే ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి ఏరియాలో షూటింగ్ జరుగుతోంది.

మహేష్ బాబుతో పాటు కొందరు ఇతర నటీ నటులపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ షెడ్యూల్లో హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొననుంది.

ఈ సినిమా పూర్తిగా పాలిటిక్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ఇతర అంశాలపైనా డైరెక్టర్ కొరటాల శివ కేర్ తీసుకున్నాడని తెలుస్తోంది.

ముఖ్యంగా కొరటాల ముందు తీసిన మిర్చి.. శ్రీమంతుడు సినిమాల్లో హీరో- హీరోయిన్ల లవ్ ట్రాక్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడు భరత్ అనే నేనులో కూడా హీరో మహేష్- హీరోయిన్ కియారా అద్వానీల మధ్య లవ్ స్టోరీ సూపర్ గా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్.

మరోవైపు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు. మహేష్, కొరటాల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ప్రకాష్ రాజ్ – శరత్ కుమార్ – రావు రమేష్ – పోసాని కృష్ణ మురళి – దేవరాజ్ లాంటి సీనియర్ నటులంతా వాల్ల పాత్రల్లో అదరగొట్టేస్తారని ఆ సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది.

ఈ వేసవికి రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా 2018 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదే హుషారులో మ‌హేష్ మ‌రో భారీ చిత్రంలో న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్ 25 వ సినిమా సెట్స్‌కెళ్ల‌నుంది.

ఫిబ్రవరి/మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళుతోంది. ఇప్ప‌టికే న్యూయార్క్‌లో లొకేష‌న్ల వేట సాగించార‌ని తెలుస్తోంది.

అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను 2018 లో షూటింగ్ స్టార్ట్ చేసి అదే సంవత్సరం విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ అసలు ప్లాన్.

అంటే మహేష్ 2018 లో కొరటాల మూవీని, వంశీ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడన్నమాట. అంటే మహేష్ అభిమానులకు మహేష్ డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నాడన్నమాట.

Share

Leave a Comment