భరత్ అనే నేను కొత్త విడుదల తేది !

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్‌ అనే నేను’. కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 27న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

కాని తాజాగా ఈ సినిమా ఒకరోజు ముందు వస్తుందని నిర్మాతలు వెల్లడించారు. ఏప్రిల్ 26 న భరత్ అనే నేను ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ”ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి కంటిన్యుయేషన్‌గా పూనెలో షెడ్యూల్‌ ఉంటుంది.

మార్చి 27 వరకు టోటల్‌గా సినిమాకి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తవుతుంది. ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం.

మహేష్‌గారితో కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బేనర్‌కి ఇది ఓ ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది” అన్నారు.

రిలీజ్ డేట్‌కి, షూటింగ్ కంప్లీట్ డేట్‌కి మధ్య ఒక నెల గ్యాప్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ప్రాబ్లమ్ ఉండదు. ‘భరత్ అనే నేను’ టీమ్ ప్లానింగ్ ఇది.

షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే పబ్లిసిటీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. వేసవి సెలవలు కావడంతో ఆ సమయంలో విడుదల చేస్తే సినిమాకు ఏమాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అదిరిపోతాయని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ తీసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారంలో మహేష్ బాబు క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

Share

Leave a Comment