పండగ ముందే మొదలవనుంది..

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భరత్‌ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అదేంటీ.. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి కదా…

మళ్లీ ఏపీకి భరత్‌ ముఖ్యమంత్రి కావడం ఏమిటి? అనుకుంటున్నారా? అదేనండీ… కొరటాల శివ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథే ‘భరత్‌ అనే నేను’ చిత్రం.

మహేష్‌ బాబు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఇందులో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా భరత్‌ అనే పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్‌ 26 నుంచి ఆయన పాలన ప్రారంభం కానుంది.

సంక్రాంతి బరితో భరత్ ఉంటాడని మొదట వార్తలు వచ్చినా సమ్మర్‌కు అంటే 2018 ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా ‘భరత్ అనే నేను’ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

‘భరత్ అనే నేను’ మూవీ విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. కొద్ది రోజులుగా మూవీ రిలీజ్ డేట్‌పై అభిమానుల‌లో సందిగ్ధం నెలకొన‌గా, దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్‌.

ఏప్రిల్ 26న భ‌ర‌త్ అను నేను చిత్రం విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆ త‌ర్వాత పూణేలో కంటిన్యూ షెడ్యూల్ జ‌రుపుకోనుంది.

మార్చి 27 వ‌ర‌కు సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంద‌ట‌.ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ “మార్చి 27 వరకు టోటల్‌గా సినిమాకి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తవుతుంది.

నిర్మాణానంతర కార్యక్రమాలూ చురుగ్గా సాగుతున్నాయి. అనుకున్న తేదీన, ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం.

మహేష్‌ బాబు–కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీ. ఇది మా బేనర్‌కి ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది.” అన్నారు.

శ్రీమంతుడు తరవాత మహేష్‌ – కొరటాల కలయికలో వస్తున్న చిత్రమిది. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే పబ్లిసిటీ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

వేసవి సెలవలు కావడంతో ఆ సమయంలో విడుదల చేస్తే సినిమాకు ఏమాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అదిరిపోతాయని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఒక ఫిక్షనల్‌ పొలిటికల్‌ డ్రామాగా ‘భరత్ అనే నేను’ మూవీని తెరకెక్కిస్తున్నారు కొరటాల. దేవి శ్రీ సంగీతం రూపొందిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి.

Share

Leave a Comment