‘భరత్ అనే నేను’ పాటల చిత్రీకరణ..

మహేశ్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోంది.

ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకూ తమిళనాడులోని ‘కారైకుడి’లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. యాక్షన్‌ పార్ట్‌, ఓ పాట చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ లో ముంబై లోనే భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో కలిసి మహేష్ గడుపుతున్నారు.

ముంబై నుంచి అటునుంచి అటే మహేష్ తమిళనాడుకు వెళ్లనున్నారు. అక్కడ ఒక యాక్షన్ సీన్ తో పాటు కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

ఈ షెడ్యూల్ తో 90 శాతం టాకీ పార్ట్ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను వచ్చేనెలలో చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు.

అదే రోజున ‘ నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అప్పటికే ‘2.0’ థియేటర్స్ లో ఉంటుంది. అందువలన ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చనున్నారనీ, రెండు వారాల ముందుగానే విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై ఈ సినిమా టీమ్ స్పందించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు జరగనున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే ఏప్రిల్ 27వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతుందని స్పష్టం చేశారు.

‘భరత్‌ అనే నేను’ సినిమా రూపకల్పన పూర్తి కాకముందే అన్ని ప్రాంతాల్లో భారీ ధరలకు అమ్ముడవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌ హక్కులు చాలా పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి.

మహేష్‌ చిత్రాల్లోకెల్లా ఇది అత్యధిక ధర కాగా…తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు మించిన క్రేజ్‌ కనిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ రికార్డు స్థాయిలో వసూళ్ళు చేసింది.

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్న ఇందులో ప్రతి పక్షనేతగా పోసాని కృష్ణమురళి నవ్వులు పూయించనున్నట్టు సమాచారం.

Share

Leave a Comment