భరత్‌ … స్పీడు పెంచాడు ..

మహేష్‌ బాబు – కొరటాల శివ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. డి.వి.వి.దానయ్య నిర్మాత. జనవరి 26న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.

ఫస్ట్ ఓత్ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రిగా మహేష్ ఫస్ట్ లుక్ లో అదరగొట్టారు. ఇప్పుడు చిత్రీకరణ వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

ఎలాగైనా మార్చ్ లోగా షూటింగ్ ముగించేయాలని భావిస్తోంది. అలాగే డబ్బింగ్ తదితరాలు కూడా మార్చి 8 కల్లా పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.

మార్చిలో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని, ముందు అనుకున్నట్టే ఏప్రిల్‌ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

27న ‘భరత్‌ అనే నేను’కి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఏ 27న అంటే వచ్చే నెల అన్నమాట. ఆ రోజుకల్లా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ చేసేసి, గమ్మడికాయ కొట్టేయనున్నారు.

ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారంలో మహేష్ బాబు క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

ఇక సినిమా రిలీజ్‌ రోజున అభిమాన హీరో కటౌట్స్‌కి ఫ్యాన్స్‌ ఎలానూ పాలాభిషేం చేస్తారు కదా. ఏప్రిల్‌ 27కి మహేష్‌ బాబు అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు.

‘శ్రీమంతుడు’ తరవాత మహేష్‌ – కొరటాల కలయికలో వస్తున్న చిత్రమిది. కాబట్టి ఆ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రమిది.

పొలిటికల్‌ డ్రామా మేళవించిన యాక్షన్‌/ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌ కథతో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే సినిమా బడ్జెట్ లో దాదాపు 75% రికవర్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. వ్యాపారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

ప్రీ రిలీజ్ లో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని అభిమానులు చాలా కాంఫిడెన్స్ తో ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకొనే కొరటాల ఈ సినిమాలో విద్యా వ్యవస్థ మరియు పేదరికం గురించి చర్చించబోతునట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, సమాజంలో తలెత్తుతున్న అనేక అరాచకాలపై హీరో ఫైట్‌ చేస్తాడనే సమాచారం చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమా ఆడియో హ‌క్కులను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ రికార్డ్ ప్రైజ్ లో కొనుక్కుంది అని సమాచారం. శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఇంతకు ముందు కని విని ఎరుగని ప్రైస్ కి కొనుక్కుంది.

Share

Leave a Comment