ప్రభాస్‌కు స్పెషల్‌గా…

రెబల్ స్టార్ ప్రభాస్ 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ తారలు వారి బెస్ట్ విషెస్ ని అందిస్తున్నారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళికి ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో అదే తరహాలో ఆ సినిమా కోసం ఐదేళ్లు మరో సినిమాను టచ్ చేయకుండా కష్టపడిన ప్రభాస్ కి కూడా మంచి గౌరవం దక్కింది.

కలెక్షన్స్ కంటే కూడా వారి స్థాయి చిరస్థాయిగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక మన స్టార్ హీరోలు కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెబల్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంధించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. సాధారణంగా మహేష్ అందరి హీరోలతో చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు

ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజుకు కూడా మహేష్ బాబు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రభాస్! మీకు అనంతమైన విజయం, ఆనందం అలాగే శాంతి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని మహేష్ చాలా ఫ్రెండ్లిగా పేర్కొన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ తో కలిసి ఉన్న ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు

మహేష్ బాబు హీరోలందరితో కూడా స్నేహంగా ఉండాలని కోరుకుంటాడని మరోసారి ఋజువయ్యింది. ఇప్పుడు ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అంధించడంతో అభిమానులు ఆ ట్వీట్ ని వైరల్ అయ్యేలా రీట్వీట్ చేస్తున్నారు. ప్రభాస్ కు కూడా మహేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది

బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ మహేష్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చారు ప్రభాస్. మహేష్ తన సినిమాలలో క్యారెక్టర్ లను అండర్ ప్లే చేయడంలో బెస్ట్. ఆయన ఒక సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చారు ప్రభాస్. పోకిరి మూవీ తనకు బాగా ఇష్టమని ఆ సినిమాను తాను ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు అన్నారు

నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డార్లింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటగా వస్తోన్న ఈ సినిమా తో మహేష్ తన హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని కోరుకుందాం

Share

Leave a Comment