ఇండియాలోనే నెంబర్ వన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న 43వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు మహేష్ అప్ కమింగ్ మూవీ `మహర్షి` టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ లను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో మహేష్ అభిమానులకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చినట్లయింది. మహేష్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వాటికి బదులుగా మహేష్ ట్వీట్ చేశారు. ‘మీ ప్రేమ మరియు దీవెనలు నాలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఈ రోజు నుండి నా జర్నీ ‘రిషి’గా మొదలైంది’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. అసంఖ్యాకంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోను విష్ చేస్తూ ముంచెత్తారు. అది కూడా అలా ఇలా కాదు ఒక రేంజ్ లో సూపర్ స్టార్ కు బర్త్‌డే విషెస్ చెప్పారు.

సూపర్ స్టార్ కు బర్త్‌డే విషెస్ చెపుతూ వాడిన టాగ్ ‘హెచ్‌బిడిసూపర్‌స్టార్‌మహేష్’ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ బర్త్‌డే ట్యాగ్ అయిపోయింది. 4.5 మిలియన్లకు పైగా ట్వీట్‌లతో సూపర్ స్టార్ అభిమానులు ట్విట్టర్ ను ముంచెత్తారు. దీంతో ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్యాగ్ అయిపోయింది.

మహేష్ బాబు అందమైన స్టార్ మాత్రమే కాదు అందమైన మనసు ఉన్న మనిషి అంటూ ఆయన చేస్తున్న మంచి పనులను, సేవా కార్యక్రమాలను పలువురు అభిమానులు గుర్తు చేసుకున్నారు. ట్వీట్ల మీద ట్వీట్లతో సూపర్ స్టార్ పై తమ ప్రేమను చాటి చెప్పారు.

మహర్షి టీజర్ కి వరల్డ్‌వైడ్‌గా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘మహర్షి’లో రిషిగా ఓ డిఫరెంట్‌ రోల్‌లో, కొత్త లుక్‌లో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించనున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌లలో షెడ్యూల్స్‌ జరుపుకున్న ఈ భారీ చిత్రం నిర్మాణం ఏకథాటిగా జరుగుతోంది.

మహేష్‌ కెరీర్‌లో 25వ మూవీ ‘మహర్షి’కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌. హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2019లో ఈ మూవీ విడుదల కానుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యు. మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌ బాబు, కె.ఎల్‌. ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ సాంకేతిక వర్గం.

Share

Leave a Comment