సూపర్‌స్టార్ చాలా స్పెషల్‌గా

ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది 15% లోపే. మరి ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అలా ఉంటే వ్యక్తిగతంగా ఒక దర్శకుడి సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు? మహా అంటే పాతిక శాతం. కానీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం ఎవరికైనా మతిపోవడం గ్యారెంటీ. ఇప్పటికి చేసింది నాలుగు సినిమాలు. ఇప్పటి వరకు పరాజయమే ఎరుగని దర్శకుడు ఆయన.

ఇప్పటివరకూ అయితే 100 % సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రోజు కొరటాల శివ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కొరటాలకు బర్త్ డే విషెస్ తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాల్లో రెండు చిత్రాలు సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసినవే. అవి శ్రీమంతుడు, భరత్ అనే నేను.

దీంతో మహేష్ కు కొరటాల అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ రోజు కొరటాల జన్మదినం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “మన జెనరేషన్ లో మోస్ట్ టాలెంటెడ్ & విజనరీ డైరెక్టర్. నా ప్రియమైన స్నేహితుడు కొరటాల శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే సర్. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలి” అంటూ విషెస్ తెలిపారు.

ఈ ట్వీట్ తో పాటుగా కొరటాల శివ ను ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫోటో ఒకదాన్ని పోస్ట్ చేశారు మహేష్ బాబు. గత ఏడాది కూడా మ‌హేష్ బాబు ట్విట‌ర్ ద్వారా కొర‌టాల శివ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. `నా ప్రియ‌మిత్రుడు, గొప్ప ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ సర్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. జీవితాంతం ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మీపై గౌర‌వం ఎప్ప‌టికీ త‌గ్గ‌దు` అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా భరత్ అనే నేను సినిమాలోని ప్రెస్ మీట్ సీన్ గురించి ప్రస్తావిస్తూ తనకి దక్కిన ప్రశంసలు అన్ని మీకే చెందుతాయి అని చెప్పి అవన్ని కొరటాల శివ గారికి అంకితం చేస్తున్నాను అని ట్వీట్ చేసారు మహేష్. భరత్ అనే నేను సినిమాలో రాష్ట్రాభివృద్ది కోసం నిధులు ఎలా వినియోగించుకోవాలి, ప్రజల నమ్మకాన్ని డబ్బు తో కాదు అభివృద్ది చూపించి గెల్చుకోవాలన్న కాన్సెప్ట్ సూపర్ గా తెరకెక్కించారు కొరటాల.

జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చిన వారు సొంతూరు బాగు కోసం పాటుపడాలన్న ఆలోచనతో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. డబ్బున్నవాడు కాదు, మనసున్నోడే అసలైన శ్రీమంతుడనేది ఒక్క లైన్ లో ఈ సినిమా స్టోరీ. సామాజిక స్పృహ ను పెంచే కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఓ స్టార్ హీరో ఈ సినిమా చేయడం అందరినీ ఆలోచింపజేసింది.

రెగ్యులర్ రొటీన్ మసాలా కథలకు కాస్త కామా పెట్టి మన చుట్టూ ఉండే వాస్తవ పరిస్ధితులు ముడిపెడ్తూ ఉన్నంతలో మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ మెసేజ్ ని మోసుకొచ్చాడు శ్రీమంతుడు. ఊరి దత్తతు అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాడు శ్రీమంతుడు. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ అయితే జనాల్లో కి బాగా చొచ్చుకు పోయింది.

బ్రతుకుతెరవు కోసం పుట్టిన ఊరుని వదిలేసి వచ్చి ఎదిగిన తర్వాత మీరు మీ పుట్టిన ఊరుకి కూడా ఏదో ఒకటి చేయాలనే సందేశం ఇచ్చిన ఈ సినిమా ఒక అద్భుతం. కొరటాల, మహేష్ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు మహేష్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. అలాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాలను మహేష్ ఫ్యాన్స్ ఎప్పటికి మరచిపోరు. హ్యాపీ బర్త్ డే కొరటాల సర్.

Share

Leave a Comment