సూపర్‌స్టార్ బెస్ట్ విషెస్

సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు ఇండియన్ మూవీ మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్

శంకర్ తీసే సినిమాల్లో భారతీయత, దేశభక్తి అడుగడున కనిపిస్తాయి. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ కు ప్రత్యేక స్థానం ఉంది. డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు నేడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి శంకర్ సినిమాలు అంటే ఇష్టం ఉన్న సంగతి తెలిసిందే

మహేష్ బాబు అభిమానించే దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేష్ కూడా ట్విట్టర్ వేదిక గా చేసుకుని తన విషెష్ తెలియజేసాడు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు శంకర్ సర్. మీ సృజనాత్మకతో మీ సినిమాలతో మీరు మాకు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండండి

ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ప్రశాంతతో ఇలాగే నవ్వుతూ సురక్షితంగా ఉండండి. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి. ప్రేక్షకలుకి మీదైన శైలిలో మంచి చిత్రాలని అందించాలి అని సూపర్‌స్టార్ మహేష్ బాబు పోస్ట్ చేశారు

ఇక ప్రస్తుతం శంకర్‌ కమల్‌ హాసన్‌ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దనున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ ప‌రశురామ్ ద‌ర్శక‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన సూప‌ర్ స్టార్ మోషన్ పోస్టర్ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చెయ్యకుండా కేవలం ప్రీ లుక్ పోస్టర్ తోనే సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ రికార్డులను నెలకొల్పుతున్నారు. ఏదేమైన ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్‌డేట్‌నే ఇంత బ‌జ్ క్రియేట్ చేస్తుంటే మ‌రి ఈ సినిమా విడుద‌ల‌కు ఎంత హంగామా షురూ అవుతుందో చూడాల్సిందే

మహేష్ చేయబోతున్న పరుశురాం సర్కారు వారి పాట సినిమా కూడా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు అనుగునంగా ఆయన కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్తూనే ప్రయోగాలతో కెరీర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు ప్రిన్స్

Share

Leave a Comment