ఎంతో స్పూర్తిదాయకమన్న మహేష్

నేడు సీనియర్ హీరో కమల్ హాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు. ఈ నేపథ్యంలోనే ఆయనకు టాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో విలక్షణ నటుడైన కమల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు కమల్ హాసన్ సినీరంగానికి అందించిన సహకారం అసాధారణం, అద్వితీయం అని కొనియాడారు మహేష్.

‘కమల్ హాసన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ రంగానికి మీరందించిన సహకారం అసాధారణం, అద్వితీయం. అలాగే, సినీ రంగంలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న మీకు శుభాకాంక్షలు.. మీ జర్నీ నిజంగా చాలా స్ఫూర్తివంతం. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కంటూ మహేష్ బాబు ట్వీట్ పెట్టారు.

మొద‌టి సినిమాలోనే బాల న‌టుడిగా జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డు అందుకున్నాడు. తెలుగులో ‘అంతులేని కథ’,‘మరో చరిత్ర’ సినిమాలతో గుర్తింపు ల‌భించింది. ‘స్వాతి ముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి సినిమాల్లో మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు సాధించాడు.

కమల్ హాసన్ గారికి కూడా మహేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయనే అనేక సందర్భాలలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లదించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కమల్ తనయ శృతి హాసన్ అభిమాన నటుడు కూడా మహేష్ కావడం విశేషం.

శృతి ఒక ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో – మహేష్‌ బాబు సరసన నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన ఒక జెంటిల్ మ్యాన్. ఎప్పుడూ నవ్వుతూ మనల్ని కూడా నవ్విస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సినిమాల గురించే మాట్లాడతారు. చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి మహేష్ గారితో అని చెప్పారు.

మరోవైపు మహేష్ బాబు తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నారు. కొంతకాలం గ్యాప్ తర్వాత మహేష్ ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ-యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది. సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సరిలేరు నీకెవ్వరు అన్నట్లుగా అలరించే విధంగా ఈ చిత్రంలోని మహేష్ పాత్ర ఉంటుందట. ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలో కూడా టైటిల్ కు తగ్గట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. అనిల్ రావిపూడి యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండేలా చూసుకుంటున్నాడట.

ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్ గా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

Share

Leave a Comment