గత పాతికేళ్ళుగా

మహర్షి సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను మొదలు పెట్టేశారు. మహేష్ బాబు కెరీర్‌లో 26 వ సినిమాగా రానున్న ఈ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కంఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో భాగంగా కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా మహేష్ అక్కడ నుంచి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఆశక్తికర ట్వీట్ చేసారు.

తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న మహేష్ బాబు, జీవితంలో ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ఇక తనతో కలిసి పనిచేసేవారిని కూడా గుర్తించి వారి వారి పుట్టినరోజు తేదీలు తెలుసుకుని మరీ వారిని విష్ చేస్తుంటారు. మహేష్ బాబు తన సిబ్బందితో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత పాతికేళ్లుగా ఒకే మేకప్ మ్యాన్ తోనే పని చేస్తూ వస్తున్నారు మహేష్.

ఆయన పేరు పట్టాభి. తాజాగా పట్టాభి జన్మదినం సందర్భంగా మహేష్ బాబు తామిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. హ్యాపీ బర్త్ డే పట్టాభి. మిమ్మల్ని ఎప్పటికీ ఇష్టపడతాను. మీ పై ప్రేమ, అభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ స్పందించారు. మహేష్ పెట్టిన ఈ పోస్టుపై ఆయన అర్ధాంగి నమ్రత, వదిన శిల్పా శిరోద్కర్ కూడా కామెంట్ చేశారు.

హ్యాపీ బర్త్ డే పట్టాభి గారూ అంటూ విషెస్ తెలిపారు. మహేష్ బాబు పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఒకే వ్యక్తితో ఇరవై ఐదు సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారంటే మహేష్ కు, ఆయనకు ఎంత మంచి రిలేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ మీ కోసం.

1)

2)

3)

4)

5)

Share

Leave a Comment