సూపర్‌స్టార్ బర్త్‌డే విషెస్

సినిమా ఇండస్ట్రీ అన్న తరువాత విజయాలు ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో నిలబడాలి అంటే విజయాలు ఉండాలి. ఒకటి రెండు పరాజయాలు వచ్చినా విజయమే అంతిమంగా ఒక ఇండస్ట్రీలో నిలబెడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయాలే తప్పా పరాజయాలు ఎరుగని ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు వరసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం 13వ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్నది. బాహుబలి సినిమా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దర్శక ధీరుడిగా నిలబెట్టింది. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలవడం విశేషం.

బాహుబలి సీరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం. భారీ చిత్రాలను తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

మన మోస్ట్ ఐకానిక్ డైరెక్టర్ రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాకే ఒక తరం సినిమా మేకర్స్ ను ఇంకా ఇన్‌స్పైర్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా మహేష్ రాజమౌళి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ దీని తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడనే ఊహాగానాలు మొదలైపోయాయి. బాహుబలి తర్వాత ఏడాదిపైగా గ్యాప్ తీసుకుని ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న జక్కన్న ఇకపై ఎంత టైం తీసుకుంటాడో ఊహించడం కష్టమే. అందులోనూ మహేష్ బాబు తోనే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఈ కాంబో సాధ్యమవ్వాలని ట్రేడ్ సైతం కోరుకుంటోంది. మహర్షి సినిమాకి సంబంధించిన ప్రొమోషన్ సమయంలో మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా మహేష్‌ని అడిగితే రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పారు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నారు.

మహేష్, రాజమౌళి ల కాంబినేషన్ లో సినిమా అంటే అది ఇండియాలోనే బెగ్గెస్ట్ ప్రాజక్ట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో మరి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే ముల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు రాజమౌళి. ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

అలాగే మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని సినీ ప్రేమికులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

దసరా సందర్భంగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఒక మాస్ పోస్టర్‌తో మురిపించిన అనిల్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ అభిమాలకు మరింత ఆనందాన్నిచ్చే మాటలు చెప్పారు. మరి ఈ సినిమా లు అన్నీ పూర్తి అయిన తరువాతే మహేష్, రాజమౌళి ల కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Share

Leave a Comment