సూపర్‌స్టార్ స్పెషల్‌గా

స్టూడెంట్ నం.1 నుంచి వరుస విజయాలు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ వంటి ఎన్నో ఒకదానితో ఒకటి సంబంధం లేని చిత్రాలు దర్శకధీరుడిగా రాజమౌళిని నిలబెట్టాయి. అపజయమెరుగని జైత్రయాత్ర ‘బాహుబలి’ అనే మహా యజ్ఞానికి చేరుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీని ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అనేలా చేశాయి.

నేడు(బుధవారం) రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు రాజమౌళి గారికి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ అద్భుతమైన సినిమాల్లాగే ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు మహేష్ బాబు.

ఆయన తీసిన బాహుబలి పార్ట్-1, పార్ట్-2 చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అద్భుత సక్సెస్‌ను సాధించి ఒకదాని రికార్డును మరొకటి బీట్ చేసింది. దర్శకుడిగా రాజమౌళి రేంజ్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌కి తీసుకెళ్లాయి. 2018 జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి-2’ సినిమా కి స్థానం దక్కినప్పుడు కూడా మహేష్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

రాజమౌళి తన కెరీర్‌లో అత్యధిక చిత్రాలు ఎన్టీఆర్‌తోనే తీశారు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీ స్టారర్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావొచ్చిందని టాక్. నవంబర్‌ చివరిలో కానీ డిసెంబర్‌లో కానీ ఈ చిత్రం ప్రారంభమవుతుందని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సిల్వర్‌ జూబ్లీ మూవీగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగబోతోంది. 20 రోజులు పాటు అక్కడే షూటింగ్ జరిపి తరువాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.

రామోజీ ఫిలిం సిటీలో మహర్షి సినిమా కోసం సెట్‌ వేస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్ సునీల్‌ బాబు ఆధ్వర్యంలో ఈ సెట్‌ నిర్మణం జరుగుతోంది. చిత్ర యూనిట్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఈ సెట్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలవ్వడం, అమెరికా షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి ఈ భారీ సెట్ ని పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు యూనిట్.

Share

Leave a Comment