అన్నీ బ్లాక్‌బస్టరే

సినిమా అనేది కోట్లలో జరిగే వ్యాపారం. ఈ వ్యాపారం బాగా జరగాలంటే ఆకర్షణ ముఖ్యం. జనాలను కానీ బయ్యర్లను కానీ ఆకర్షించాలంటే కాంబినేషన్ కీలకం. అందుకే సినిమాల్లో కాంబినేషన్స్ అంటే క్రేజ్ ఎక్కువ. కేవలం కాంబినేషన్ చూసే సినిమాలు అమ్ముడైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఈ కాంబినేషన్ ల తో పాటు అభిమానులను ఎదురుచూసే అంశాలు కూడా కావాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అదిరే ఫైట్లు, స్టొరీతో పాటు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ను కూడా ఆశిస్తారు. మహేష్ బాబు సినిమాలంటే సూపర్ హిట్ పాటలకు ప్రసిద్ధి. దాదాపు మహేష్ బాబు అన్ని ఆల్బమ్స్ హిట్ అయినవే.

ముఖ్యంగా సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ గురించి అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్సే. ఈ పరిచయ గీతాల్లో సింహ భాగం మహేష్ బాబు, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చినవే. వీరి కాంబినేషన్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు వచ్చాయి.

ఇప్పుడు ఆ పరిచయ గీతాల బాధ్యతను మధ్యలో తమన్, ఇప్పుడు దేవీశ్రీప్రసాద్ తమ భుజాన వేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే మహేష్ సినిమాలోని పరిచయ గీతం అంటే అది బ్లాక్‌బస్టరే. అలాంటి మహేష్ బాబు సినిమాల్లోని పరిచయ గీతాలను ఇప్పుడు కొన్నిటిని చూద్దాం.

1. రాజకుమారుడు – బాలీవుడ్ బాలరాజుని

2. మురారి – డుం డుం డుం

3. టక్కరి దొంగ – నలుగురికి నచ్చినది

4. ఒక్కడు – హరే రామ

5. నాని – నాని వయసే

6. అతడు – అదరక బదులే

7. పోకిరి – జగడమే

8. దూకుడు – నీ దూకుడు

9. వన్ నేనొక్కడినే – హూ ఆర్ యూ

10. ఆగడు – ఆగడు

11. భరత్ అనే నేను – ఐ దోంట్ నో

12. మహర్షి – నువ్వే సమస్తం

మణిశర్మ గారి తరువాత ఇప్పుడు దేవీశ్రీప్రసాద్ మన మహేష్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మహేష్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు నిర్మాతలు. భరత్ అనే నేను, మహర్షి తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాకు కూడా దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇందులో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. ఇది వరకటి పరిచయ గీతాల కంటే సరిలేరు నీకెవ్వరు లో ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోవాలని భారీ అంచనాలతో ఉన్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా మన ముందుకు రానుంది.

Share

Leave a Comment