చరిత్ర స్రుష్టించిన ‘ఒక్కడు’…

తిరుగులేని క్రేజ్ అతని సొంతం.. ప్రిన్స్ గ తెరంగేట్రం చేసి తన స్వశక్తి తో సూపర్ స్టార్ స్టేజ్ కి అంచెలు అంచెలుగా ఎదిగాడు మహేష్.

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆరంభం నుంచే టాలీవుడ్ యువరాజు. అయితే.. మహేష్ కు సూపర్ స్టార్ ఇమేజ్ ఆపాదించిన చిత్రం ఒక్కడు.

2003 లో విడుదల అయిన ఒక్కడు.. మహేష్ కెరీర్ లో 7వ చిత్రం కాగా.. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది.

గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. మహేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సంక్రాంతి తో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తి కావడంతో..

మహేష్ అభిమానులు 15 ఇయర్స్ ఆఫ్ ఒక్కడు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేసేస్తున్నారు. తిరుగులేని స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్లస్ పాయింట్.

మహేష్ బాబు.. జోడీగా నటించిన భూమిక అందం.. గుణశేఖర్ డైరెక్షన్.. ఎంఎస్ రాజు నిర్మాణ విలువలు..ప్రకాష్ రాజ్ అద్బుతమైన నటన..మణిశర్మ పాటలు ఇలా ఎన్నో అంశాలు ఒక్కడు సక్సెస్ లో కీలక పాత్ర వహించాయి.

మరోవైపు ఒక్కడు మూవీలో దాదాపు 2 కోట్ల రూపాయలో చార్మినార్ సెట్ నిర్మించి.. చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఆ సెట్ చుట్టుపక్కల తీయడం..

ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఒక్కడు తర్వాతే ఇలా భారీ సెట్టింగులలో మెజారిటీ పార్ట్ షూటింగ్ అనే ట్రెండ్ మొదలైంది.

ఈ చిత్రం 8 కేటగిరిల్లో నంది అవార్డులను గెలుచుకోగా.. ఫిలింఫేర్.. సినీ మా అవార్డులలో బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని అందుకున్నాడు మహేష్.

Share

Leave a Comment