మహేష్ ఖాతాలో కొత్త బ్రాండ్

నేషనల్‌ వైడ్‌లో బడా బడా స్టార్స్‌, క్రికెటర్స్‌కి ధీటైన ఫాలోయింగ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉంది. మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్‌ స్థాయికి వచ్చే సరికి సౌత్ మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి.

పలు అంతర్జాతీయ బ్రాండ్స్ మహేష్ ను తమ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటున్నాయి. తాజాగా మహేష్ బాబు మరొక బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ప్రముఖ పర్‌ఫ్యూమ్ ఉత్పత్తుల సంస్థ ‘డెన్‌వర్’. డెన్‌వర్ డియోస్ కి ఇక నుంచి సూపర్ స్టార్ ప్రచారకర్త గా వ్యవహరిస్తారు.

‘డెన్‌వర్’ కి ఉత్తరాదిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి నుంచి సౌత్ ఇండియాకి డెన్‌వర్ బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా వెల్లడించారు.

హైదరాబాద్ లో ఒక ప్రెస్‌మీట్ ను ఈ రోజు ఏర్పాటు చేసి సూపర్ స్టార్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఈ ప్రోడక్ట్ కు సంబంధించిన యాడ్ షూట్ ను కూడా ఈ రోజు హైదరాబాద్‌లో పూర్తి చేసారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తో ప్రెస్‌మీట్ ను కూడా ఏర్పాటు చేసారు.

మహేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బడా కంపెనీలు కోట్లాది రూపాయల ఆఫర్ తో మహేష్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకుంటున్న హీరోల జాబితాలోనూ టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ నంబర్ వన్ గా నిలిచారు.

మల్టీనేషనల్ బ్రాండ్స్ కి మహేష్ బాబు బ్రాండింగ్ చేసిన స్థాయి లో ఏ టాలీవుడ్ హీరో చెయ్యలేదు. ఇప్పటికే థంప్స్ అప్, య‌ప్ టీవీ, అభి బస్, గోల్డ్ విన్నర్, చెన్నయ్ సిల్క్స్, ఇంటెక్స్, లాయిడ్, టివిస్, మహేంద్ర, అమృతాంజన్‌, నవరత్న ఆయిల్‌, యూనివర్సెల్‌, ఐడియా సెల్యులార్‌, జాస్‌ అలుక్కాస్‌, ప్రొవోగ్‌, వివెల్‌ షాంపూలకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్ గా నిరూపించుకున్నాడు మహేష్. సినిమాల‌తో పాటు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌లు సంస్థ‌లకు వ్య‌వ‌హ‌రిస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చాలా బిజీ. ఇంత బిజీలోనూ మ‌రో ఉత్పత్తి ‘డెన్‌వర్’ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సంతకం చేశాడు.

అతను నటించిన కొన్ని సినిమాలు ఓటమిని చవిచుశాయేమో కానీ అతను నటనలో మాత్రం ఎప్పుడు ఓడిపోలేదు. అతని నటనకు అవార్డులు రెడ్ కార్పెట్ పరుస్తాయి. అతనిని విమర్శించే వారికి తన నటనతోనే సమాధానం చెప్తాడు. అందుకే మహేష్ బాబు అంటే పేరు కాదు ఇట్స్ ఎ బ్రాండ్!!

కార్పొరేట్ బ్రాండ్లకు మాత్రమే కాదు సమాజానికి సేవ చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. తన సంపాదన్లో ఎక్కువ భాగం సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంటారు మహేష్. అనారోగ్యంతో బాధ పడుతున్న నిరుపేద పిల్లలకు సహాయం చేసే నిమిత్తం మహేష్ బాబు అనేక హాస్పిటల్స్ మరియు ఫౌండేషన్ లతో టై అప్ అయ్యారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతోంది. విభిన్నమైన గెటప్పుల్లో మహేష్ అలరించనున్నాడని ఇప్పటికే ప్రచారమవుతోంది. అందులోను ఇది మహేష్ ల్యాండ్‌మార్కు 25వ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగా హైప్ పెరుగుతోంది.

Share

Leave a Comment