మెగా సూపర్‌స్టార్ల కలయిక

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవం సందర్బంగా సినీ మహోత్సవం పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. నేటి తరం నటీనటులతో పాటు అలనాటి మేటి తారలతో కళకళలాడింది సినీ మహోత్సవ వేదిక.

ఈ వేడుక కృష్ణ‌, కృష్ణంరాజు, కె. రాఘవేంద్రరావు, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, టి.సుబ్బ‌రామిరెడ్డి, ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, సుమల‌త‌, రాజేంద‌ప్ర‌సాద్‌, న‌రేశ్‌, కోట‌శ్రీనివాస‌రావు స‌హా ప‌లువురు సినీ పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. దీంతో సభా ప్రాంగణమంతా సందడి సందడిగా కనిపించింది. అయితే ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

సాధారణంగా చిరంజీవి, మ‌హేష్ ఇద్దరూ కలిసి ఒకే వేడుక‌లో క‌న‌ప‌డ‌టం చాలా చాలా అరుదుగా చూశాం. అలాంటి అరుదైన సందర్భం ఈ వేడుకలో కనిపించడంతో కెమెరా కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే పడ్డాయి. చిరంజీవి, మ‌హేష్ లు క‌లిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ అరుదైన కలయిక చుసిన ఇరువురి అభిమానులు ఖుషీ అవుతూ అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేసుకుంటున్నారు.

చిరు అంటే ఎప్పుడైనా సరే ప్రేమాభిమానం చూపించే ప్రిన్స్ దాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కూడా ఎన్నడూ వదులుకోలేదు. నిన్నా అదే జరిగింది. చిరంజీవి గారితో మాట్లాడుతుంటే ఒక రకమైన కొత్త ఎనర్జీ వస్తుందని మరోసారి ఈ సందర్భంగా దాన్ని ఆస్వాదించానని చెప్పడంతో స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది.

తన ప్రసంగాన్ని ఈ మాటలతోనే మొదలుపెట్టిన మహేష్ ఆపై మరింత కిక్ ఇచ్చేలా సైరా ప్రస్తావన తీసుకొచ్చారు. సైరా టీజర్ చూశానని నమ్మశక్యంగా లేదని అలాంటి విజువల్ వండర్ ని అందరితో పాటు తనకూ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉందని ప్రకటించడంతో ఈలలు మాములుగా వినిపించలేదు. మహేష్ మాటలు వింటూ చిరంజీవి థాంక్యూ అనటం నిన్న ఈవెంట్ కే హైలైట్.

ఇవన్నీ చెప్పాక సూపర్ స్టార్ అసలు టాపిక్ లోకి వెళ్ళారు. సినిమాలన్నీ అనుకున్న టైం కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా పూర్తి అవుతున్నాయంటే దానికి కారణం ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌. వారు లేకపోతే సినిమా లేదు. అలంటి ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఈవెంట్ కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్‌ అని ప్రొడ‌క్ష‌న్ యూనియ‌న్‌కు మ‌హేష్ అభినంద‌నలు తెలిపారు.

చిరు అంటే తనకు ఎంత గౌరవమో మరోసారి చాటి చెప్పిన మహేష్ స్పీచ్ తాలుకు వీడియో సైతం బాగా స్ప్రెడ్ అవుతోంది. అతిరథమహారధులు ఎందరు వచ్చినా ఈ మెగా సూపర్ స్టార్ల కలయికే అట్రాక్షన్ ఆఫ్ ది ఈవెనింగ్ గా అందరి దృష్టిని ఆకట్టుకుంది. చిరంజీవి, మహేష్ పక్కపక్కన కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ఈ వేడుక హైలెట్.

ఈ సినీ మహోత్సవంలో చిరంజీవి, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, రాజేశేఖర్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నిహారిక, నాగబాబు, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, బోయపాటి శ్రీను, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటీనటులు కృష్ణ, కృష్ణంరాజు, గిరిబాబు, మురళీమోహన్ గీతాంజలిలను యూనియన్ సత్కరించింది. కార్యక్రమంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Share

Leave a Comment