చిరు, మహేష్‌ లతో ‘మా’ భారీ ఈవెంట్ ..

`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

దీనిలో భాగంగా ఇటీవ‌లే హైద‌రాబాద్ లో టాలీవుడ్ సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ‌వైభంగా క‌ర్టైన్ రైజ‌ర్ వేడుక జ‌రిగింది. ఏప్రిల్ 28న అమెరికా డ‌ల్లాస్ లో తొలి ఈవెంట్ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్న‌ట్లు తెలిపారు. ఆ తరువాత మే లో జరగబోయే రెండో ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా హాజరవుతారు.

శివాజీ రాజా మాట్లాడుతూ, `చిరంజీవి గారికి `మా` వేడుక‌లు గురించి చెప్ప‌గానే వెంట‌నే ఒప్పు కున్నారు. ఎక్క‌డికి రావడానికైనా సిద్దంగా ఉన్నాన‌ని హామీ ఇచ్చారు. అలాగే మ‌హేష్ బాబు గారు కూడా మేలో జ‌రిగే ఓ ఈవెంట్ కు వ‌స్తాన‌న్నారు.

వీరిద్ద‌రూ మాకు ఎంతో స‌హాకారాన్ని అందిస్తున్నారు. వీరిరువురికి మేము రుణపడి ఉంటాం. చిరంజీవి గారు ఏప్రిల్ లో జరిగే ఈవెంట్ కి అందుబాటు లో ఉంటానని మాట ఇచ్చారు.

మహేష్ బాబు గారిని కలిసిన వెంటనే అప్యాయంగా పలకరించి నాన్న గారు చెప్పారు శివాజి గారు..నేను తప్పకుండా ఈవెంట్ కి హాజరు అవుతాను అన్నారు.

మే నెలలో అమెరికా లో జరిపే ఈవెంట్ కి మన టాలివుడ్ తరుపున వస్తాను, ఘనం గా వేడుక జరుపుకుందాం అని ఆయన అనడం చాల సంతొషం గా ఉంది.

మెగా స్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్ట్ ని మర్చిపోలేము. అందుకే ‘మా’ నిర్మించే నూతన భవంతి లొ రెండు వింగ్స్ కి చిరంజీవి గారి పేరుని, మహేష్ గారి పేరుని పెట్టి వారికి గౌరవం ఇవ్వదలిచం.

అలాగే బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, వెంక‌టేష్, నాగార్జున కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. `మా` కోసం ఎత‌క‌ష్ట‌మైనా ప‌డ‌టానికి నేను..మాటీమ్ సిద్దంగా ఉన్నాం.

`మా` సిల్వ‌ర్ జూబ్లీ సంద‌ర్భంగా 35 మందికి ఈ నెల నుంచి 3000 పెన్ష‌న్ అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. `మా` అనుకున్న కార్య‌క్ర‌మాల‌న్నింటిని దిగ్విజియంగా పూర్తిచేస్తాం` అని అన్నారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, ` చిరంజీవిగారు, మ‌హేష్ బాబు గారు `మా` జ‌రిపే కార్య‌క్ర‌మాల‌కు పూర్తిగా స‌హ‌కారం అందిస్తున్నందు చాలా సంతోషంగా ఉంది.

అలాగే హీరోయిన్లు అంద‌రూ కూడా మెంబ‌ర్ షిప్ తీసుకోవాలి. `మా` జ‌రిపే కార్య‌క్ర‌మాల‌కు కూడా స‌హ‌కారం అందించాలి..లేకపొతే చర్యలు తప్పవు అని అన్నారు.

క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో నాభూతో న‌భ‌విష్య‌త్ అన్నట్లు ఈ వెంట్ ను గ్రాండ్ గా చేయనున్నారు.. అమెరికాలో ఉన్న ఎన్ ఆర్ ఐలంతా ఈవెంట్ కు హ‌జ‌ర‌వుతారు.

దాదాపు 8000 నుండి10,000 సామార్ధ్యం గ‌ల ఆడిటోరియంలో ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఒకే వేదిక‌పై స్టార్స్ అందరూ లైవ్ లో అభిమానులని అలరించనున్నారు.

Share

Leave a Comment