మహేష్ ఇంట క్రిస్టమస్ సందడి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలుపుతూ తన అనుభూతులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

క్రిస్టమస్ సందర్భంగా ఆదివారం రాత్రి మహేష్ శాంటాక్లాజ్ తో దిగిన ఫోటో ను తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసారు.

ఈ పర్వ దినాన మనం వెరే వాల్లకి సహాయం చెసే స్పిరిట్ యొక్క గొప్పతనం గురించి చెప్తూ “బ్రింగింగ్ శాంటా హోమ్” అని మహేష్ ట్వీట్ చెసారు.

ఈ ఫోటో కి అభిమాల నుంచి లైక్స్ , షేర్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. వెంటనే ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మహేష్ బాబు ఆఫీషల్ టీం వారు కూడా బ్రింగింగ్ శాంటా హోమ్ అని క్రిస్టమస్ విషెస్ తెలియజేస్తూ మహేష్ శాంటా తో ఉన్న మరొక ఫోటో ని విడుదల చేసారు.

విడుదల చేసిన ఫోటో సోషల్ నెట్ వర్కలో వైరల్ అయ్యింది. ట్విట్టర్ లో ఇండియా వైడ్ ట్రేండింగ్ మరియు ఫేసుబుక్ లో వేలాది లైక్ లు , షేర్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు సతీమని నమ్రత మంచి హోమ్ మేకర్ అనే చెప్పాలి. భర్తనీ, పిల్లలు గౌతమ్, సితారలను బాగా చూసుకుంటుంది. పిల్లలకు మన సంప్రదాయాలను చెప్పి, పెంచుతున్నారు.

పిల్లలకు ఎంజాయ్ మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు.. గుడికి కూడా తీసుకెళుతుంటారు నమ్రత. కుల మతాలకు అతీతంగా ఇంట్లో అన్ని పండగలు జరుపుతుంది.

ఈ ఏడాది వినాయక చవితి, దసరా, దీపావళి తదితర పండగలను మహేష్ బాబు ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది.

అలాగే, నార్త్ లో సోదర సోదరీమణులకు సంబంధించిన పండగను కూడా ఇటీవల నమ్రత తన పిల్లలతో జరిపించింది.

ఇప్పుడు మహేష్ ఇంట్లో క్రిస్మస్ సందడి మొదలైంది. ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఈ సందర్భంగా బుల్లి సితార శాంటా క్లాస్ లా తయారైంది.

ఈ బుల్లి శాంటా క్లాస్ ఎంత ముద్దుగా ఉందో ఈ ఫొటోల్లో చూడొచ్చు. చూడముచ్చటగా ఉంది కదూ !!

పిల్లలకు అన్ని రకాల పండగల మీద అవగాహన కల్పించడానికే మహేష్, నమ్రత ఇలా ఇంట్లో ప్రతి పండగ జరుపుతుంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మహేష్ బాబు క్రిస్టమస్ రోజు తన ట్విట్టర్ ద్వారా శాంటా తో ఉన్న ఫోటో ని పెట్టి అభిమానులను ఉత్తేజపరిచడమే కాకుండా అన్ని పండుగలని తాను సమానంగా జరుపుకుంటానని మరోసారి చాటి చెప్పారు.

ప్రస్తుతం మహేష్ కొరటాల తో చేస్తున్న ‘ భరత్ అనే నేను ‘ సినిమాను సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌  లో రిలీజ్‌  చెయాలని అనుకుంటున్నారు.

Share

Leave a Comment