మహేష్ చేతికి గాయమంటూ

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో సినీమహోత్సవం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. తారల ఆట పాటలు, వినోద కార్యక్రమాలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన ఈ వేడుకకు పరిశ్రమ మొత్తం తరలి వచ్చింది. వెండితెరపై మెరిసే తారలు ఒకే వేదికపై కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.

నిన్న కన్నులపండువగా అంగరంగ వైభవంగా జరిగిన సినీ మహోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కలిసి ముచ్చటించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చిరంజీవి అంటే ఎప్పుడైనా సరే ప్రేమాభిమానం చూపించే ప్రిన్స్ నిన్న మరోసారి ౠజువు చేసారు.

చిరంజీవి గారితో మాట్లాడుతుంటే ఒక రకమైన కొత్త ఎనర్జీ వస్తుందని మరోసారి ఈ సందర్భంగా దాన్ని ఆస్వాదించానని మహేష్ చెప్పడంతో స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది. మరి ఇద్దరు వెండితెర ఇలవేల్పులను ఒకేసారి ఇలా చూడడంతో సభాప్రాంగణం అంతా హోరెత్తింది. అయితే మహేష్, చిరంజీవి ల ఫొటోలో ఒక కొత్త విషయం బైట పడింది.

ఇప్పుడు ఆ విషయమే టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది. ఈ ఫొటోల్లో మహేష్ చేతికి చిన్న గాయం అయినట్లు స్పష్టంగా కనబడుతుంది. దీంతో మహేష్ చేతికి ఈ గాయం ఎందుకు అయ్యిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అన్నా నువ్ జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతూ ఈ పిక్ ను వైరల్ చేస్తున్నారు.

మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ దెబ్బ ఆ షూటింగ్ లోనే అయ్యుంటుందని మాట్లాడుకుంటున్నారు. దర్సకుడు అనిల్ రావిపూడి కి జాగ్రత్త గా షూటింగ్ చేయండి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అసలు విషయం తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ గాయం గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసి సక్సెస్ అవుతుంటారు మహేష్. అందుకే తండ్రి లక్షణాలు అందిపుచ్చుకుంటూ తెలుగు తెరపై సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఆయన గురించి ఏ వార్త అయినా వెంటనే వైరల్ అయిపోతుంది.

ఈ తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా పాల్గొన్నారు. కృష్ణంరాజు, రాజేశేఖర్, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నీహారిక, నాగబాబు, కిషన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ మహోత్సవం ఇంత గ్రాండ్ గా చేసిన మేనేజెర్స్ యూనియన్ కు అభినందనలు. సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారధులు ఈ ఫంక్షన్ కు రావడం హర్చించదగ్గ విషయం. నేను భవిషత్తులో కూడా చిత్ర పరిశ్రమకు సహాయపడతాను. కుల,మతానికి అతీతంగా ఇండస్ట్రీలో ఉన్నవారందరు ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది.

భవిష్యత్తు లో వీరు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుందాం అన్నారు. ఈ సందర్భంగా నటీనటులు కృష్ణ, కృష్ణంరాజు, గిరిబాబు, మురళీమోహన్ గీతాంజలిలను యూనియన్ సత్కరించింది. కార్యక్రమంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Comment