పాస్ ఆవో అంటున్న సూపర్‌స్టార్

దక్షిణాది చిత్రసీమలో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన ప్రాంతీయ భాష స్టార్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు. విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న యాక్టర్ మహేష్. ఇక అమ్మాయిల్లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మహేష్ ఎప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడే.

అందుకేనేమో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. రెండు డజన్ల పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వన్ ఆండ్ ఓన్లీ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు. తాజా ఆయన ఖాతాలో మరో అంతర్జాతీయ బ్రాండ్ ‘క్లోసప్’ చేరింది.

మహేష్ తన న్యూ లుక్ తో ‘క్లోసప్’ కి ఒక యాడ్ చేసారు. నేడు సదరు కంపెనీ వారు ఈ వీడియో ని విడుదల చేసారు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన కొత్త లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. అభిమానులు ఫుల్ ఖుషీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ చేసేస్తున్నారు.

క్లోసప్ తో కలిపి మహేష్ బాబు ఇప్పటివరకు 29వ బ్రాండ్లకు ప్రచారకర్త గా వ్యవహరించారు. తెలుగు హీరోల్లో ఇన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన వారు లేరు. ఈ రికార్డ్ మహేష్ పేరిట మాత్రమే నమోదైంది. అలాగే ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకున్న హీరోల జాబితాలోనూ మహేష్ నంబర్ వన్ గా నిలిచారు.

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ ప్రధమ స్థానం లో ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంతో తెలుస్తుంది. సినిమాలు, యాడ్స్ రెండింటిని మహేష్ సమంగా ప్లాన్ చేసుకుంటారు. మహేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బడా కంపెనీలు ఆఫర్స్ తో మహేష్ చుట్టూ తిరుగుతుంటాయి.

మహేష్ ప్రస్తుతం తన 25వ సినిమా ‘మహర్షి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్, 2019న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Share

Leave a Comment