ఎప్పటికీ కలల రాకుమారుడే

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా మారారు. మురారి, పోకిరి, అతడు, దూకుడు లాంటి సినిమాతో మాస్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు. ‘భరత్ అనే నేను’ సినిమాతో ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు.

ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకుంటున్న హీరోల జాబితాలోనూ టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ నంబర్ వన్ గా నిలిచారు.

ఇక అమ్మాయిల్లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మహేష్ ఎప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడే. అందుకే పలు అంతర్జాతీయ బ్రాండ్స్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. రెండు డజన్ల పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వన్ ఆండ్ ఓన్లీ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు.

తాజా ఆయన ఖాతాలో మరో అంతర్జాతీయ బ్రాండ్ ‘క్లోసప్’ చేరింది. ఈ యాడ్ మన హ్యాండ్సమ్ హీరోతో మరింత అందంగా ముస్తాబై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దగ్గరగా రా.. దగ్గరగా రా.. దగ్గరగా రావా’ అంటూ మహేష్ రెడ్ కలర్ జాకెట్‌లో ఓ ముద్దుగుమ్మతో కలిసి అదరగొడుతున్నాడు.

రెడ్ కాస్ట్యూమ్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు యధావిధిగా అదిరిపోగా, ఈ యాడ్ దాదాపుగా రెండు నిముషాల పాటు ఉండడం విశేషం. కాకపోతే..’క్లోజప్’ ఫేమస్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ సాగిన ఈ యాడ్ బహుశా టీవీలలోకి వచ్చేపాటికి సెకన్ల నిడివికి కట్ అవుతుంది గానీ, రెండు నిముషాల నిడివి గల ఈ ఫుల్ సాంగ్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు క్లోజప్ యాడ్ లో ఎంతో మంది నటించారు. ఈ యాడ్ లో ఇది వరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించి అదరగొట్టారు. తాజాగా మహేష్ బాబు కూడా ‘క్లోజప్’ యాడ్ లో నవయువకుడిలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Share

Leave a Comment