40 ఏళ్ల సూపర్ స్టార్ సినీ ప్రస్థానం..

ఆయన స్క్రీన్ మీద కనబడితే ఫ్యాన్స్ కు పండగే. అతనంటే యువతలో అంతులేని క్రేజు. అమ్మాయిల హృదయ సామ్రాజ్యానికి అతను ఓ యువ రాజు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు చైల్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ను ప్రారంభించారు. మొదటినుండి నటనలో తనదైన ముద్ర వేసుకుంటూ అంచెలంచెలుగా ఈ స్థాయి కి చేరుకున్నాడు.

1979 లో నీడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మహేష్ నటనలో ఎన్నో మెళుకువలు నేర్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ నెం 1 గా ఎదిగారు. నీడ సినిమాలో మురళీమోహన్ హీరోగా నటించగా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మహేష్ తన తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించారు.

కృష్ణకు కొడుకుగా తమ్ముడిగా కూడా నటించాడు మహేష్. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 1999లో రాజకుమారుడు సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువ రాజు సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడు గా మారిపోయాడు. ఇక కృష్ణ వంశీ తెరకెక్కించిన మురారి సినిమా మహేష్ బాబుని సిసలైన హీరోని చేసింది.

ఈ సినిమా తో మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు సినిమా మహేష్ కెరియర్ నే మలుపు తిప్పింది. యాక్షన్ హీరోగా మహేష్ ను మరో మెట్టు పైకి ఎక్కించింది ఈసినిమా. “ఒక్కడు” సినిమా ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర క్రియేట్ చేసింది.

ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాద్ పోకిరి సినిమాతో మహేష్ ను మాస్ ఆడియన్స్ కు చేరువ చేసాడు. ఈ సినిమా సృష్టించిన రికార్డుకు అన్ని ఇన్ని కావు. ఎక్కడ చుసిన “పోకిరి” ప్రభంజనమే కనిపించేది. ఆరేంజ్లో హిట్ కొట్టాడు మహేష్. ఆ తర్వాత మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మహేష్ కు భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక వరుసగా సినిమాలు చేయాడంమొదలు పెట్టాడు. తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ స్టార్ అయ్యాడు మహేష్. ఇక శ్రీను వైట్ల దర్శకత్వం లో నటించిన దూకుడు సినిమా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. నైజాం, ఓవర్సీస్ లో కొత్త చరిత్ర లిఖించారు ఈ సినిమాతో.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో నటించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఓ మంచి విందుభోజనగా చెప్పాలి. ఈ సినిమా తో పక్కింటి కుర్రాడిగా మహేష్ అందరి మనస్సులో నిలిచిపోయాడు. ఎంతో అవలీలగా ఈ సినిమాలో చిన్నోడి పాత్ర లో జీవించాడు మహేష్.

ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా మహేష్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరవాత వరుస విజయాలను అందుకున్నాడు. మహేష్ కొరటాల తో రెండొవ సినిమా గా వచ్చిన భరత్ అనే నేను సినిమా కూడా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కేవలం ఎంటర్‌టైన్మెంట్ కాకుండా మంచి సందేశాన్నిచ్చారు.

ఇక వంశీ పైడిపల్లి తో కలిసి రీసెంట్ గా మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలంటే కేవలం మాస్ మసాలా లే కావాని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేల ఉండాలనే తాపత్రయంతో మహేష్ ఎంచుకునే కధలు అద్భుతం.

ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ నేటితో తన సినీ కెరియర్ లో 40 ఏళ్ల ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరూ సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఈ సినిమా తో మరో సారి మహేష్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని అభిమానులు చెప్తున్నారు.

మహేష్ తన కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకున్న చాలా సింపిల్ గా “డౌన్ టు ఎర్త్” ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యే మహేష్ అదే తనను సూపర్ స్టార్ గా నిలబెట్టిదని మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇలా మహేష్ తన కెరియర్ లో మరెన్నో విజయాలను అందుకోవాలని మనమూ ఆశిద్దాం..

Share

Leave a Comment