అనౌన్స్ చేసిన మహేష్

బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు సుకుమార్, సూపర్‌స్టార్ మహేష్‌ బాబు కలయికలో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. నేనొక్కడినే కాంబినేషన్‌ వన్స్‌మోర్‌ రిపీట్‌ కానుందన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మంచి ఆసక్తి ఏర్పడింది. సుకుమార్ – మహేష్ బాబు కలిసి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని ఎదురు చూస్తున్నారు.

సుకుమార్‌ కథ తయారు చేసే పని మీద ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. కాని నేడు సుకుమార్ జన్మదిన సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సుకుమార్ కి ప్రత్యేకంగా విషేస్ తెలుపుతూ తన నెక్స్ట్ ఫిల్మ్ సుక్కు తోనే అని వెల్లడించేసాడు. దీని బట్టీ చూస్తే ఇప్పటి వరకు ఉన్న రూమర్లకి ఇక చెక్ పడినట్టే. మహేష్ 26వ మూవి సుక్కూ దర్శకత్వం లోనే ఉండబోతుంది.

“మోస్ట్ హంబుల్ ఆండ్ సూపర్ టాలెంటేడ్ దర్శకుడైన సుకుమార్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీతో కలిసి చేయబోయే నా తదుపరి చిత్రం కోసం ఆశక్తి గా ఎదురుచూస్తున్నాను అతి త్వరలో మన చిత్రాన్ని మొదలుపెడదాం” అని మహేష్ ట్వీట్ చేసారు.

తాజా సమాచారమేంటంటే మహేష్ కోసం సుక్కు అదిరిపోయే కథను, స్క్రిప్ట్ ను రెడీ చేశారట. ఈ కథ మహేష్ కు చాలా బాగా నచ్చిందని, ప్రాజెక్ట్‌ పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారని టాక్‌. సుక్కు చెప్పిన కథకు మహేష్ ఫిదా అయ్యాడని తెలుస్తోంది. సుక్కూ కథ పూర్తి స్థాయి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పనులు మొదలెట్టారని సమాచారం.

మహేష్ ఇమేజ్‌కు తగిన విధంగా సుకుమార్ కథను రూపొందించనట్టు తెలుస్తున్నది. కొత్త కథ తో తనదైన శైలి లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా పక్కగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుక్కు. ఎప్పటిలానే కధనం లో కొత్తదనం మిస్ అవ్వకుండా, చాలా మంచి ఎమోషన్స్ తో అందరికీ అర్ధం అయ్యేలా ఉండబోతుంది అని క్లారిటి ఇచ్చారు సుకుమార్.

ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కించనున్నారు. సుకుమార్ జన్మదినం సందర్భంగా మైత్రీ మూవీస్ వారు కూడా అఫీషియల్ గా మహేష్ 26 వ చిత్రనికి తమ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వం వహిస్తారని పేపర్ యాడ్ సైతం ఇచ్చారు.

ఇది వరకు చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు మెచ్చేలా ఒక థ్రిల్లింగ్ స్టోరీ సుకుమార్ రెడీ చేస్తున్నారట. సుకుమార్ ఈ చిత్రంతో ఎలాగైనా సూపర్ స్టార్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కసితో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా బిజీలో ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. సుకుమార్ – మహేష్ బాబు సినిమా ఏప్రిల్‌ నుండి మొదలు కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మే నుండి మొదలు కానుందని తెలుస్తోంది. కానీ, మహేష్‌ ఈ సినిమాకు జూన్‌ నుండి వరుసగా డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహేష్‌ కాంబినేషన్‌లో ఉన్న సీన్లను జూన్‌ నుండి షూట్‌ చేయనున్నారని సమాచారం. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ.. అవన్ని వట్టి రూమర్లే. చిత్రబందం మాత్రం స్టార్‌ హీరోయిన్ని ఫైనల్‌ చేసే పనిలో ఉంది.

మహేష్ బాబు కెరీర్‌లో మునుపెన్నడూ చూడనటువంటి కమర్షియల్‌ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోందట. ప‌క్కా స్క్రిప్ట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు మ‌న లెక్క‌ల మాస్టారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువ‌డ‌తాయి.

మహేష్‌ బాబు అభిమానులకు 2019 కొత్త సంవత్సరం సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఫస్ట్ లుక్ టీజర్ లో కాలేజ్ కుర్రాడిలా, మహేష్ ని మరింత యంగ్ గా ప్రెజెంట్ చేసిన మేకర్స్, ఈ సెకండ్ లుక్ లో స్టైలిష్ బిజినెస్ మ్యాన్ లా ప్రెజెంట్ చేశారు. ఈ సారి కూడా అదే రేంజ్ లో అదిరిపోయాడు సూపర్ స్టార్.

మహేష్ ని ఇలా రెండు రకాలుగా చూపించి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు వంశీ. ఈ సినిమాలో రిషి అనే వ్యక్తి జీవిత ప్రయాణం చూపించబోతున్నాడని తెలుస్తోంది. టైటిల్ పోస్టర్ లో మహర్షి పక్కన జర్నీ ఆఫ్ రిషి అని ట్యాగ్ లైన్ పెట్టడానికి కారణం కూడా అదే.

Share

Leave a Comment