రాజమౌళికి మహేష్ శుభాకాంక్షలు

బాహుబలి 2 సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగును అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు రాజమౌళిని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆకానికెత్తేస్తున్నారు.

2018 జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి-2’ సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. మూడు విభాగాల్లో `బాహుబ‌లి-2`కు అవార్డులు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

`బాహుబ‌లి` సిరీస్ సినిమాల‌తో తెలుగు సినిమ ఖ్యాతిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. దేశంలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా `బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌` నిలిచిన సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళికి సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళికి, బాహుబలి టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

‘జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ సినిమా బాహుబలి భారతీయ సినీచరిత్రలో ఓ మైలురాయి. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతుండగా, రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

అంతేకాదు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేయల్‌ నారాయణ ఈ కాంబినేషన్‌ లో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

Share

Leave a Comment